War 2 day 2 Hindi Collections: సాధారణంగా సీక్వెల్ హైప్ తో వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయి టాక్ ని సొంతం చేసుకున్నా బంపర్ వసూళ్లు వస్తుంటాయి. ఒకవేళ మిస్ ఫైర్ అయితే మాత్రం దారుణమైన వసూళ్లు నమోదు అవుతుంటాయి. ప్రస్తుతం ‘వార్ 2′(War 2 Movie) పరిస్థితి అలాగే ఉంది. ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం పై మొదటి నుండి అంచనాలు పెద్దగా ఉండేవి కాదు. ఎందుకంటే ఇది హిందీ డబ్బింగ్ సినిమా అవ్వడం, దానికి తోడు ఎన్టీఆర్(Junior NTR) ఇందులో నెగిటివ్ క్యారక్టర్ చేస్తున్నాడు అనే క్లారిటీ అందరికీ ఉండడం వల్ల అభిమానులు ఈ సినిమా పై ఆశలు పెట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే తెలుగు వెర్షన్ కోసం హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ రెండు కాలర్లు ఎగరేసి ఈ సినిమా తో కుంభస్థలం కొడుతున్నాం అని చెప్పడంతో అంచనాలు అమాంతం పెరిగాయి.
Also Read: రెమ్యూనరేషన్స్ కోసమే నాగార్జున,ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్స్ చేశారా..? ఫ్యాన్స్ ఎమోషన్స్ అవసరం లేదా!
ఎన్టీఆర్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఇక సినిమాకు తెలుగు లో ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే దారుణం నుండి అతి దారుణమైన ఓపెనింగ్స్ ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో నమోదు అయ్యాయి. హిందీ లో కూడా స్పై యూనివర్స్ లో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న చిత్రంగా నిల్చింది. కానీ హిందీ లో హృతిక్ రోషన్(Hrithik Roshan) క్రేజ్ కారణంగా రెండవ రోజు పబ్లిక్ హాలిడే అడ్వాంటేజ్ తో భారీ వసూళ్లను నమోదు చేసుకుంది. బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు 42 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా మూడవ రోజు కృష్ణాష్టమి అవ్వడం తో ఈరోజు కూడా హిందీ లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read: 2వ రోజు హిందీలో దున్నేస్తున్న ‘వార్ 2’..గ్రాస్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉందంటే!
ఇక తెలుగు వెర్షన్ వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజే ఈ సినిమాకు క్లోజింగ్ వేసేసుకోవచ్చు, అలా ఉన్నాయి మరి. ఆంధ్ర లో కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కారణంగా నిన్న పబ్లిక్ హాలిడే ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని కాస్త డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి గ్రోత్ లేదు. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండవ రోజు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నేటి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కన్నీళ్లు రావడం ఒక్కటే తక్కువ. ఒక్క చోట కూడా బుక్ మై షో యాప్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ లేదు. హైదరాబాద్ వంటి సిటీ లో కూడా తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ కి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని 90 కోట్లకు కొనుగోలు చేసాడు. ట్రెండ్ ని చూస్తుంటే ఆయనకు 60 కోట్ల రూపాయిలు పొయ్యేలాగానే అనిపిస్తున్నాయి.