spot_img
HomeతెలంగాణK A Paul: కవిత 10 కోట్లు అడిగితే.. కెసిఆర్ ఎందుకు వద్దన్నారు.. కేఏ పాల్...

K A Paul: కవిత 10 కోట్లు అడిగితే.. కెసిఆర్ ఎందుకు వద్దన్నారు.. కేఏ పాల్ బయటపెట్టిన నిజం

K A Paul: రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సీరియస్ వ్యవహారంగా సాగుతున్నప్పుడు.. అకస్మాత్తుగా కేఏ పాల్ ప్రవేశిస్తారు.. సీరియస్ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన గురించి చర్చ జరిగేలా చూసుకుంటారు. కేఏ పాల్ ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ.. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశారు.

తెలంగాణలో కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పేరుతో ఇటీవల పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ఆమోదముద్ర లభించేలా చూసుకున్నారు. ఒకరకంగా భారత్ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించే పనిచేస్తున్న నేపథ్యంలో.. అకస్మాత్తుగా కవిత తన పార్టీ పేరు టిఆర్ఎస్ అని పేరు ప్రకటించి.. ఆ పేరును తనకు మాత్రమే పరిమితమయ్యేలాగా చూసుకున్నారు. తద్వారా రాజకీయంగా కవిత గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ కు గట్టి సవాల్ విసిరారు.. కవిత అంతటితోనే ఆగలేదు. తన తండ్రి మీద.. తన సోదరుడి మీద.. బావ హరీష్ రావు మీద.. మరో సోదరుడు సంతోష్ రావు మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఇదంతా కుటుంబ గొడవ అని కొంతమంది వాదిస్తున్నప్పటికీ.. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ కవిత మీడియాలో పతాక శీర్షికలో ఉంటున్నారు.

కవిత గొడవ అలా ఉంటే.. మధ్యలోకి కేఏ పాల్ ప్రవేశించారు. ఈ రాజకీయ రణరంగాన్ని మరోవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక స్వీయ వీడియోలో కేఏ పాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ” నేను అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపే పనిలో బిజీగా ఉన్నాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో అనేక పర్యాయాలు మాట్లాడాను.. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధితో కూడా చర్చలు జరిపాను. ఇదిలా ఉండగానే కవిత తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ప్రకటించారు. ఇదంతా కూడా సోదరుడితో జరుగుతున్న ఆస్తుల గొడవ. 2008లో నా చారిటీ సిటీ వద్దకు కవిత వచ్చారు. 10 కోట్లు ఇవ్వాలని అడిగారు. నేను కేసీఆర్ కు ఫోన్ చేశాను. మీరు అడిగితే 10 కాదు, 15 కోట్లు కూడా ఇస్తాను. కానీ కవిత 10 కోట్లు అడుగుతున్నారు.. ఎంత ఇవ్వమంటారని కేసీఆర్ ను అడిగాను. దానికి ఆయన రూపాయి కూడా ఇవ్వద్దని చెప్పారు. నేను కూడా కవితకు రూపాయి ఇవ్వలేదని” కేఏ పాల్ వ్యాఖ్యానించారు..

ఊరందరిది ఒక దారి అయితే.. ఉలిపి కట్టేది మరొక దారి అంటారు. ఇప్పుడు కేఏ పాల్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. కవిత ఎందుకోసం పార్టీ ఏర్పాటు చేశారు.. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి.. అనే విషయాలను పక్కన పెడితే.. ఈ వ్యవహారాన్ని మొత్తం పూర్తి హాస్యాస్పదంగా మార్చడానికి కేఏ పాల్ కంకణం కట్టుకున్నట్టున్నారు. అందువల్లే తర్కం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టారు. కే ఏ పాల్ ఈ వీడియో బయటికి విడుదల చేయడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీరియస్ పాలిటిక్స్ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుంది. అందులోనూ నవ్వులు పండించడం కొందరికే సాధ్యమవుతుంది. అందులో కేఏ పాల్ మొదటి స్థానంలో ఉంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper