Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya Samantha: ఒకే వేదిక పై కలుసుకున్న నాగ చైతన్య - సమంత.. సంచలనం...

Naga Chaitanya Samantha: ఒకే వేదిక పై కలుసుకున్న నాగ చైతన్య – సమంత.. సంచలనం రేపుతున్న వీడియో..

Naga Chaitanya Samantha: ఒకప్పుడు టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య , సమంత జంట విడిపోవడం అభిమానులకు ఎంత బాధని కలిగించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. అప్పట్లో ఏ ఈవెంట్ కి వెళ్లాలన్నా కలిసి వెళ్ళేవాళ్ళు , వీళ్లిద్దరు కలిసి పెళ్లి ఎన్ని పెళ్లి ఈవెంట్స్ లో పాల్గొన్నారో లెక్కే లేదు. ఈ జంటని చూసినప్పుడల్లా ఆడియన్సు దిష్టి పెట్టేవాళ్ళు , అంత ముచ్చటగా ఉండేది. కానీ దురదృష్టం కొద్దీ […]

Naga Chaitanya Samantha: ఒకప్పుడు టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య , సమంత జంట విడిపోవడం అభిమానులకు ఎంత బాధని కలిగించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. అప్పట్లో ఏ ఈవెంట్ కి వెళ్లాలన్నా కలిసి వెళ్ళేవాళ్ళు , వీళ్లిద్దరు కలిసి పెళ్లి ఎన్ని పెళ్లి ఈవెంట్స్ లో పాల్గొన్నారో లెక్కే లేదు. ఈ జంటని చూసినప్పుడల్లా ఆడియన్సు దిష్టి పెట్టేవాళ్ళు , అంత ముచ్చటగా ఉండేది. కానీ దురదృష్టం కొద్దీ వీళ్లిద్దరు 2021 వ సంవత్సరం లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం , ఆమె కంటే ముందే నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వంటివి జరిగాయి. వీళ్లిద్దరు తమ వ్యక్తిగత జీవితంలోనూ , వృత్తిపరంగానూ ప్రస్తుతం ఎంతో సంతోషంతో ఉన్నారు.

అయితే వీళ్లిద్దరు నిన్న ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహానికి హాజరయ్యారు. సమంత తన భర్త రాజ్ తో కలిసి ఈ పెళ్ళికి హాజరు అవ్వగా, నాగ చైతన్య తన భార్య శోభిత తో కలిసి హాజరయ్యాడు. విధి ఎంత విచిత్రమో చూడండి, సరిగ్గా నాలుగేళ్ల క్రితం నాగ చైతన్య – సమంత కలిసి ఎన్నో పెళ్లిళ్లకు హాజరు అయ్యారు , ఇప్పుడు వీళ్లిద్దరు ఒకే పెళ్లి వేడుకలో వేర్వేరుగా తమ జీవిత భాగస్వాములతో హాజరయ్యారు. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసుకొని , ఒకరిని ఒకరు వదిలి ఉండలేము అనే నిర్ధారణకు వచ్చి , పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని కలలు కన్న ఈ జంటకు ఇలాంటి సందర్భం వస్తుందని బహుశా వాళ్ళు పీడకల కూడా కని ఉండరు. జీవితం లో మనం ఎన్నో మ్యానిఫెస్ట్ చేస్తాము, కానీ దేవుడు రాసిన తలరాతకు తగ్గట్టే మన జీవితం కొనసాగుతుంది అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు.

ఇక సమంత , నాగ చైతన్య కెరీర్స్ విషయానికి వస్తే, మయోసిటిస్ కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్న సమంత, ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతుంది. ఈ నెల 14 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. ఇక నాగ చైతఞట విషయానికి వస్తే గత ఏడాదే ఈయన ‘తండేల్’ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు, ఇప్పుడు ఆయన విరూపాక్ష ఫేమ్ కార్తీక్ తో కలిసి ‘వృష కర్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper