HomeతెలంగాణFine Rice Scheme : తెలుగు ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక..

Fine Rice Scheme : తెలుగు ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక..

Fine Rice Scheme : తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఉగాది పండుగ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచి కొత్త పనులు ప్రారంభిస్తారు. తెలుగు సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతున్నందున ఇప్పటి నుంచే కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా ప్రారంభించాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీని ఇక్కడ ప్రారంభిస్తారు అంటే?

Also Read : రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తు ఎలా? అవసరమయ్యే పత్రాలు ఏవి?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే గత సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు. అయితే ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన హుజూర్నగర్ పట్టణంలో చిన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 91,19,269 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. హుజూర్నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేస్తారని అధికారులు తెలుపుతున్నారు.

ఇప్పటివరకు రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. అయితే ఈ బియ్యాన్ని చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులు తీసుకోవడం లేదు. కొందరు తీసుకున్న వెంటనే వాటిని విక్రయిస్తున్నారు. రేషన్ కార్డులో ఉన్న అక్రమాలను తొలగించేందుకే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా రేషన్ కార్డు బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయచ్చని అంటున్నారు.

పేదల కోసమే పంపిణీ చేసే సన్నబియ్యం పక్కదారి పడకుండా ఉండేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఇప్పటికే ఈ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొంటున్నారు. అధికారులు రేషన్ బియ్యం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుపుతున్నారు. అయితే రేషన్ షాప్ ల వద్ద ఈ సన్న బియ్యం కూడా పక్క దారి పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉగాది కానుకగా ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల ఎంతోమంది పేదల్లో సంతోషం వెళ్లి విరుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటారని అంటున్నారు. మరోవైపు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు తమ పేరు రాలేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డు కేవలం సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ సన్న బియ్యం పంపిణీ ద్వారా రేషన్ కార్డుకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : టెస్లాకు మించిన ఆ కారు ప్లాంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం…

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper