Telangana Govt School Teachers: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఆడుతూ పాడుతూ చేస్తారు.. సక్రమంగా విధులు నిర్వహించను అన్న అపవాదు ఉంది. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే బోధనకన్నా.. తమ వ్యక్తిగత పనులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంప దృష్టిపెట్టిన తెలంగాణ సీఎం సంస్కరణలు మొదలు పెట్టారు. టీచర్లతోనే ప్రక్షాళన షురూ చేశారు.
తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల హాజరును ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ట్రాక్ చేయాలనే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచింది. పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించే అవకాశం ఉంది. దీంతో టీచర్లు ‘స్కూల్‌కు సమయానికి రాకపోతే ఫేస్ స్కాన్ చెబుతుంది!‘
టీచర్ల టైమ్‌కి గ్యారెంటీ
పెద్దపల్లి జిల్లాలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం సత్ఫలితాలనిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. టీచర్లు సమయపాలన పాటించడం, బోధనలో క్రమశిక్షణ పెరగడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. ‘ఇప్పుడు టీచర్లు స్కూల్‌కి లేట్ కాకుండా, ఫేస్ స్కానర్ ఏర్పాటు చేశారు. టీచర్లు కూడా సమయానికి వచ్చేలా చేయాలని రేవంత్ సర్కార్ ఫేషియల్ రికగ్నిషన్ ఆలోచన చేస్తోంది. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందని విద్యాశాఖ ఆశిస్తోంది. టీచర్లు క్రమం తప్పకుండా హాజరవుతూ, నాణ్యమైన బోధన అందిస్తే, ప్రభుత్వ బడులు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తాయి.
Also Read: కన్నతల్లి కన్నీటి పాఠం – మరచిన మానవత్వం
అమలులో అడ్డంకులు..
ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేయడానికి ఖర్చు, సాంకేతిక సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం, టీచర్ల నుంచి వ్యతిరేకత వంటి సవాళ్లు ఉన్నాయి. ‘స్కూల్‌లో టీచర్ ఫేస్ స్కాన్ చేస్తే, విద్యార్థుల ఫ్యూచర్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతుందా?‘ అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. టీచర్ల గోప్యత, డేటా సెక్యూరిటీపై కూడా ఆందోళనలు ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించకపోతే ఈ టెక్ ప్రయోగం ఫ్లాప్ సినిమాగా మారే ప్రమాదం ఉంది.