Dr Mamatha Reddy: ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రమైన గుండెపోటు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఇకలేరని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రోహిణి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మమతారెడ్డి ఏకంగా తొమ్మిది సార్లు ఆయనకు సిపిఆర్ చేశారు. ఆగిపోతున్న గుండెను తిరిగి పనిచేసే విధంగా చేశారు. తద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డికి పునర్జన్మ ఇచ్చారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాన్ని కాపాడిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతారెడ్డి.. సుప్రసిద్ధ హృదయ వైద్య నిపుణురాలు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా అనేక సందర్భాలలో.. అనేక మంది రోగులకు గుండెలు ఆగిపోయే సందర్భంలో ఆమె రంగంలోకి దిగారు. సిపిఆర్ చేసి చాలామంది హృదయాలను తిరిగి పని చేసే విధంగా చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా మమతా రెడ్డి తన ధర్మాన్ని నిర్వర్తించారు. సుదర్శన్ రెడ్డికి ఏకంగా 9సార్లు సిపిఆర్ చేసి.. అత్యంత ప్రాణదారమైన చికిత్స సత్వరంగా అందించారు. ఇలా మమత చేసిన తొమ్మిది ప్రయత్నాలకు సుదర్శన్ రెడ్డి గుండె స్పందించింది. ఆయన ప్రాణం మళ్ళీ లేచి నిలబడింది. మమత రెడ్డి చేసిన చికిత్సను హరీష్ రావు అభినందించారు. మమతారెడ్డి పల్లె సుదర్శన్ రెడ్డి బతికారని కొనియాడారు.
మమతా రెడ్డి ఇటువంటి అరుదైన సిపిఆర్ లు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇదే ఏడాది ఏప్రిల్ నెలలో భారత జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ధర్మారావు కు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. ఆయన గుండె ఆగిపోయే స్థితిలో ఉంది. ఈ దశలో మమతారెడ్డి స్పందించారు. ఏకంగా 11 సార్లు సిపిఆర్ చేశారు. చివరికి ఆయన ప్రాణాలను కాపాడారు. వరుసగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల ప్రాణాలను కాపాడి మమతారెడ్డి తన వైద్య ధర్మాన్ని నిర్వర్తించారు..
వాస్తవానికి సిపిఆర్ అనేది గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస నిలిచిపోయినప్పుడు.. వైద్యులు చేసే అత్యంత అవసరమైన ప్రక్రియ. ఇందులో ప్రధానంగా రెండు చర్యలను వైద్యులు కొనసాగిస్తారు. చాతి మీద బలంగా.. నిర్దిష్ట వేగంతో ఒత్తిడి తీసుకొస్తారు. అవసరమైతే కృత్రిమంగా శ్వాస కూడా ఇస్తారు. ఈ సమయంలో గుండె పూర్తి స్థాయిలో పనిచేయకపోయినప్పటికీ.. గుండె ద్వారా మెదడు.. ఇతర కీలక అవయవాలకు రక్తప్రసరణ సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో మెదడు కణాలు దెబ్బతినపు. అప్పుడు శరీరానికి కొంతమేర రక్షణ లభిస్తుంది..
ఒక రోగికి సంబంధించి గుండె ఆగిపోయినప్పటికీ.. వైద్యులు దాదాపు 30 నిమిషాల వరకు సిపిఆర్ నిర్వహిస్తుంటారు. ఒకవేళ హృదయం స్పందించకపోతే.. రోగి పరిస్థితి ఆధారంగా చికిత్సను నిలిపివేస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఆసుపత్రులలో హృదయ నిపుణులు డిసిబ్రిలేటర్.. అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ మందులు కనక అందుబాటులో ఉంటే ఏకంగా 45 నిమిషాల నుంచి గంటపాటు సిపిఆర్ కొనసాగిస్తారు..
గుండె పని ఆగిపోతే మెదడుకు ఆక్సిజన్ నిలిచిపోతుంది. అప్పుడు మెదడు కణాలు దెబ్బతింటాయి. ఆ సమయంలో నాణ్యమైన విధానంలో సిపిఆర్ కొనసాగిస్తే రక్తప్రసరణ కొంతవరకు సాగుతుంది. మెదడుకు ఆక్సిజన్ అనేది అందుతూ ఉంటుంది. గుండెలో ఉన్న కణాలు పూర్తిగా దెబ్బతినవు. డి ఫిబ్రలేటర్ షాక్ అనేది మెరుగ్గా పనిచేస్తే.. రోగి బతికే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో రోగి ఆరోగ్య స్థితి ఆధారంగా వైద్యులు సిపిఆర్ నిర్వహిస్తూ ఉంటారు.