spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్‌రెడ్డికి డేంజర్‌ బెల్స్‌.. కేసీఆర్‌తో జాగ్రత్త.. కేకే సర్వే సంచలన రిపోర్టు!

CM Revanth Reddy: రేవంత్‌రెడ్డికి డేంజర్‌ బెల్స్‌.. కేసీఆర్‌తో జాగ్రత్త.. కేకే సర్వే సంచలన రిపోర్టు!

KK Survey: కేకే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు నూటికి 200 శాతం నిజమయ్యాయి. అన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని అంచనా వేయగా కేకే సర్వే మాత్రం వైసీపీ 11 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. అచ్చం ఇవే ఫలితాలు వచ్చాయి. దీంతో కేకే సర్వేపై చాలా మంది నమ్మకం పెరిగింది. అయితే తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేకే సర్వే తలకిందులైంది. హర్యానాలోనూ 100 శాతం కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. కేకే సర్వేనే కాదు అనేక సర్వేలు ఇవే ఫలితాలు ఇచ్చాయి. కానీ, బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది. ఇదిలా ఉంటే.. కేకే సర్వే తాజాగా తెలంగాణలో నిర్వహించిన సర్వే రిపోర్టు విడుదల చేసింది. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా.. పాలన తీరు, ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపై సర్వే నిర్వహించింది.

రేవంత్‌రెడ్డికి వార్నింగ్‌..
తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్‌ పనితీరుపై కేకే సర్వే సీఈవో కిరణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్‌రెడ్డి అలర్ట్‌గా ఉండాలని సూచించారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష హోదాలో మాత్రం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ తక్కువ మెజారిటీతోనే ఓడిందని గుర్తు చేశారు.

బలపడుతున్న బీఆర్‌ఎస్‌..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ బలపడుతోందని కిరణ్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడినా కేసీఆర్‌కు ఏం నష్ట లేదన్నారు. 80 శాతం ఓటర్లు బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై నమ్మకంతోనే ఓటేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలను చూసి ఓటు వేయరని వెల్లడించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ తర్వాత ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ మాత్రమే ప్రజలకు కనిపిస్తుందని తెలిపారు. బీజేపీ కనుచూపు మేరలో కూడా లేదని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో మంచి స్కోప్‌ ఉందని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Oktelugu Epaper