Homeజాతీయ వార్తలుIndian Journalist : మీకు మిగిలింది బ్యానర్లే.. పాక్ ప్రధాని చెడుగుడు ఆడుకున్న ఇండియన్ జర్నలిస్ట్!

Indian Journalist : మీకు మిగిలింది బ్యానర్లే.. పాక్ ప్రధాని చెడుగుడు ఆడుకున్న ఇండియన్ జర్నలిస్ట్!

Indian Journalist : ఇండియా కోసం తాపత్రయపడే పాత్రికేయులలో పాల్కి శర్మ ఒకరు. ఈమె ఫస్ట్ పోస్ట్ అనే ఛానల్ లో పనిచేస్తుంటారు. సుప్రసిద్ధ జర్నలిస్టుగా ఈమెకు రికార్డు ఉంది. జాతీయ భావజాలంతో పనిచేసే ఈమె.. దేశ సమగ్రతకు సంబంధించిన విషయంలో ఏమాత్రం రాజీపడరు. పైగా అక్కడ పార్టీలను పక్కనపెట్టి దేశాన్ని మాత్రమే చూస్తారు. ఎందుకంటే దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారని.. ప్రజలు బాగుంటేనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని నమ్ముతుంటారు. అందుకే పాల్కి శర్మ నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీలలో కనిపిస్తుంటారు. ముఖ్యంగా యుద్ధం.. దౌత్య విషయాలు.. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినప్పుడు పాల్కి శర్మ తనదైన శైలిలో స్పందిస్తారు. తను చదివే వార్తల్లో న్యూట్రాలిటీ మిస్ కాకుండా చూస్తూనే.. దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం వెనకడుగు వేయరు..

Also Read : ఉగ్రవాదులను అప్పగిస్తేనే పాక్‌కు సింధు జలాలు.. భారత్ షరతుతో ఒత్తిడిలో పాక్*

అంతకుముందు అరబ్ దేశాలు ఏదో విషయం మీద భారత్ పై విష ప్రచారం చేయబోయాయి. దానిని పాల్కి శర్మ తనదైన శైలిలో తీపి కొట్టారు. పాలస్తీనా – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం చోటు చేసుకున్నప్పుడు.. భారత్ అనుసరించిన వైఖరి పై పాల్ కి శర్మ తనదైన పాత్రికేయ విలువలను ప్రదర్శించారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదని స్పష్టం చేశారు. ఇక బిజెపి నాయకుడు అప్పుడప్పుడు చేస్తున్న చవక బారు విమర్శలపై కూడా ఆమె అదే స్థాయిలో స్పందించారు. నరేంద్ర మోడీ సరైన చర్యలు తీసుకోకపోతే పార్టీ సంకనాకి పోవడం గ్యారెంటీ అని కొండ బద్దలు కొట్టారు.

ఇప్పుడు పాకిస్తాన్ పై చెడుగుడు

సాధారణంగానే సెటైరికల్ జర్నలిజాన్ని ప్రదర్శిస్తుంటారు పాల్కీ శర్మ. ఫస్ట్ పోస్ట్ ఛానల్ లో జోక్ ఆఫ్ ది డే బులిటన్లో ఆమె పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. మోదీలాగే ఆయన కూడా ఎయిర్ బేస్ ను సందర్శించారని.. అని ఆయన వెనకాల నిజమైన మిస్సైల్ కాకుండా ఫ్లెక్సీ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద దేశానికి మట్టి మాత్రమే మిగిలిందని విమర్శించారు. ఇటీవల ఇండియా చేపట్టిన సాహసోపేతమైన పని ద్వారా.. మన సామర్థ్యం ప్రపంచానికి తెలిస్తే.. పాకిస్తాన్ పలాయన వాదం అందరికీ అర్థమైంది అన్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్లో విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలకడమే ఉగ్రవాద దేశానికి గుడ్ న్యూస్ అని పాల్కి శర్మ సెటైర్ వేశారు. సోషల్ మీడియాలో పాల్కి శర్మ బులిటన్ కు సంబంధించిన వీడియో తెగ సందడి చేస్తోంది.. ఉగ్రవాద దేశానికి సరైన సమాధానం చెప్పారు.. ఉగ్రవాద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి చెప్పుతో కొట్టినట్టు చెప్పారు.. అంటూ నెటిజన్లు ఈ వీడియోని చూసి వ్యాఖ్యానిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular