Media Ethics Violation: వెనకటికి ఓ ఊర్లో ఓ పెద్దమనిషి ఉండేవాడు. అతడి మాటలను ఆ ఊరి ప్రజలు నమ్మేవారు. జనం ఎలాగూ తన మాటలు నమ్ముతున్నారని ఆ పెద్దమనిషి రెచ్చిపోయేవాడు. ఆ ఊర్లో జరిగే ప్రతి పంచాయితీని అతడే పరిష్కరించేవాడు. అంతేకాదు జనాలకు ఏం తినాలో? ఏం తినకూడదో కూడా చెప్పేవాడు. ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని.. కూరలలో తాలింపు వేసుకుంటే జీర్ణాశయం దెబ్బతింటుందని.. నెయ్యి ని వాడితే కొవ్వు పెరుగుతుందని.. ఇలా ఆరోగ్య సూక్తి ముక్తావళి చెప్పేవాడు.. తన భర్త ఎలాగూ చెబుతున్నాడని ఆ పెద్దమనిషి భార్య వంటింట్లో అదే ప్రయోగం చేయడం మొదలుపెట్టింది. కూరల్లో ఉల్లిపాయలు వేసేది కాదు. తాలింపు కూడా పెట్టేది కాదు. పప్పు వండినప్పుడు నెయ్యి పోసేది కాదు. మొదట్లో ఆ పెద్దమనిషికి ఈ పరిణామం వింతగా తోచింది. ఆ తర్వాత భార్యను నిలదీశాడు. దానికి ఆమె “మీరు పంచాయతీల్లో చెబుతున్నారు కదా.. అందుకే అలా చేశాను అని” బదులిచ్చింది. దానికి ఆ పెద్ద మనిషికి కోపం వచ్చింది..”పిచ్చిదానా నేను చెప్పేది ఊర్లో ప్రజల కోసం మాత్రమే. అవేవీ నాకు వర్తించదు. నువ్వు ఇదివరకైతే ఎలా వండావో.. అలానే వంటలు వండు అని” అన్నాడట. దీంతో ఆ ఇల్లాలు అలానే చేయడం మొదలుపెట్టిందట. సేమ్ ఈ కథలో పెద్దమనిషి మాదిరిగానే తెలుగు నాట ఓ సుప్రసిద్ధ పాత్రికేయుడు ఉన్నాడు. వాస్తవానికి పాత్రికేయులు విషయ పరిజ్ఞానంతో విశిష్ట వ్యక్తులవుతారు. కానీ ఇతడు మాత్రం వాగాడంబరంతో విశిష్ట పాత్రికేయుడైపోయాడు.
Also Read: పూర్ణ, స్వేచ్ఛ అరుణాచలం ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? పాత్రికేయురాలి కేసులో ఇప్పుడిదే కీలకం!
తెలంగాణ సంస్కృతి గురించి ఈ పాత్రికేయుడికి తెలియదు. పైగా దానికి సొంత వ్యాఖ్యానాలు జత చేశాడు. ఇలా చెప్పినందువల్లే తెలంగాణ జనం పొట్టుపొట్టు తిట్టారు. దీంతో ఆ పాత్రికేయుడు క్షమాపణ చెప్పక తప్పలేదు. అయితే ఈ పాత్రికేయుడిలో వాగాడంబరం మాత్రమే కాదు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. తన పని చేస్తున్న న్యూస్ ఛానల్ లో మహిళా ఉద్యోగులపై పైశాచికాన్ని ప్రదర్శిస్తాడు. ఎవరు ముందు వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలను తెలుసుకుంటాడు. పైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న ప్రదేశంలోనే కుర్చీ వేసుకుని కూర్చొని వారిని చూస్తూ ఉంటాడు. వారు ఇబ్బంది పడుతున్నా సరే వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు నవ్వుతాడు. ఇటీవల ఓ మహిళా ఉద్యోగి వ్యక్తిగత పని ఉండడం వల్ల తన బాస్ పర్మిషన్ తీసుకొని అర్థగంట ముందుగానే ఇంటికి వెళ్లింది. అంతే ఇక ఆమె గురించి ఎంక్వయిరీ చేశాడు. ఆఫీసులో ఆమె అంటే పడని వాళ్ళు వ్యతిరేకంగా చెప్పారు. ఇంకేముంది సార్ రంగంలోకి దిగి.. ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడట. సార్ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళా ఉద్యోగి ఉద్యోగం మానేసి వేరే ఛానల్ లోకి వెళ్లిపోయింది
Also Read: బనకచర్ల నిలుపుదల.. రేవంత్ చెప్పిన రాగి సంకటి, రొయ్యల పులుసు కథ!
వాస్తవానికి ఆ చానల్ లో అతనికి అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి ఉద్యోగం ఉంది. సాయంత్రం పూట ఆయన డిబేట్ నిర్వహించాలి. దాదాపు రెండు గంటల పాటు ఆ షో రన్ చేయాలి. స్వతహాగానే ఆ పాత్రికేయుడికి వాగాడంబరం అధికంగా ఉంటుంది. విషయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. అందువల్లే వాగాడంబరంతో నెట్టుకొస్తాడు. నేటి ఎలక్ట్రానిక్ మీడియాకు వాగాడంబరం మాత్రమే పనికి వస్తుంది కాబట్టి.. పైగా ఆ ఛానల్ ఎండి కూడా అలాంటి వాడే కాబట్టి సరిపోతున్నది. కానీ ఈవినింగ్ తనకు షిఫ్ట్ టైమింగ్ ఉంటే.. ఉదయాన్నే రావడం ఆ పాత్రికేయుడికి అలవాటు. వచ్చి ప్రతి విషయంలోనూ వేలు పెట్టి వాసన చూడటం ఆయనకు మహాసరదా.. అతడి మీద మేనేజ్మెంట్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయలేరు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే వాళ్ళ ఉద్యోగం ఉండదు. అందువల్లే అతడు చేస్తున్న పనికిమాలిన చేష్టలను ఉద్యోగులు మౌనంగా భరిస్తున్నారు. లోలోపల తిట్టుకుంటూ కాస్తలో కాస్త తన బీపీని చల్లార్చుకుంటున్నారు.. అన్నట్టు ప్రతిరోజు సాయంత్రం ఆ ఛానల్ డిబేట్ లో ఈ వీరపాత్రికేయుడు నీతులు చెబుతుంటాడు. బీభత్సమైన నీతి సూత్రాలు వల్లె వేస్తుంటాడు. చివరికి అతడేమో ఇలా దారితప్పి అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటాడు. ఇటువంటి వ్యక్తులను పాత్రికేయులు అని చెప్పుకోవడం పాత్రికేయ లోకం చేసుకున్న దురదృష్టం.