Petrol Bunk Reporter: ఒక పని చేయాలంటే అనుభవం ఉండాలి. ఆ పనిలో అనుభవం రావాలంటే నేర్చుకోవాలి.. అలాగే ఒక ఉద్యోగం చేయాలంటే అర్హత ఉండాలి. ఆ అర్హత ఉండాలంటే చదువుకోవాలి. అర్హత లేకుండా ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఉద్యోగులపై పెత్తనం చేసే ఉద్యోగమైతే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం ఈయన మాదిరిగా ఉంటుంది..
ఆయన ఓ చానల్లో కీలక స్థానంలో ఉన్నాడు. ఆస్తమానం ఓ పార్టీని పొగుడుతూ ఉంటాడు. ఆ నాయకుడిని సర్వపరిత్యాగి అంటూ కీర్తిస్తూ ఉంటాడు. మొహమాటం ఉండదు. దాపరికమూ ఉండదు. డబ్బా కొట్టుడు మొదలు పెట్టాడంటే డీజే కూడా పనికిరాదు.. మేనేజ్మెంట్ ఒకటి చేయమంటే ఈయన పదింతలు ఎక్కువ చేస్తుంటాడు.. అందువల్లే ఆయన నిత్యం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాడు.. వాస్తవానికి ఆయన మాట్లాడే భాష విచిత్రంగా ఉంటుంది. సరే ఆయనను ఉద్యోగంలో ఉంచుకోవడం మేనేజ్మెంట్ ఇష్టం. కాబట్టి ప్రశ్నించడానికి ఉండదు. కాకపోతే ఒక పార్టీకి డబ్బా కొడుతూ.. ఒక నాయకుడికి జేజేలు పలుకుతూ అతడు చేస్తున్న దానిని జర్నలిజం అని ఎలా అంటాం.. దానిని విలువలుగల పాత్రికేయమని ఎలా చెబుతాం.. ఇటువంటి వ్యక్తులు జర్నలిజానికి మచ్చ కాదా.. జర్నలిజానికి తెగులు కాదా.. అయితే ఈ వ్యక్తికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. కాకపోతే దానిని ఇక్కడ పోస్ట్ చేస్తే లీగల్ గా మాకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్లే ఇలా రాయాల్సి వస్తోంది.
Also Read: Midhun Reddy Arrest: అరెస్టుకు లైన్ క్లియర్.. మిధున్ రెడ్డికి కోర్టు షాక్!
వాస్తవానికి ఆయన పాత్రికేయుడు కాకముందు ఒక పెట్రోల్ బంకులో పని చేశారట. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నంత మాత్రాన జర్నలిస్టు కావద్దని లేదు. కాకూడదని కూడా లేదు. కష్టపడి పని చేసిన వారు పైకి రావాలి.. అలాంటివారు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి అదే మా సిద్ధాంతం కూడా. కాకపోతే ఈ పాత్రికేయుడికి ఎటువంటి అర్హతలు లేవు. కనీసం డిగ్రీ కూడా చదువుకోలేదు. సూటు వేసుకుంటాడు. బూటు వేసుకుంటాడు.. మైక్ దొరికితే చాలు నీతులు చెప్పడం మొదలుపెడతాడు.. ఇక తనకు నచ్చని పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకుంటాడు.. అందులో విశ్లేషణ ఉండదు. వివరం అంతకన్నా ఉండదు.. సంబంధం లేని విషయాలు చెప్పడంలో.. సంబంధం లేకుండా మాట్లాడటంలో ఈయన దిట్ట.
ముందుగానే చెప్పినట్టు పెట్రోల్ బంక్ లో పనిచేసిన ఈ జర్నలిస్టు.. తన సామాజిక వర్గానికి చెందిన వారికి అత్యంత దగ్గరయ్యాడట. అంతేకాదు చమురు అమ్మి పాత్రికేయుడైన ఓ వ్యక్తికి బాగా దగ్గరయ్యాడట. అనంతరం తన సామాజిక వర్గం లోని పెద్దవారికి రకరకాల సపర్యాలు చేసి.. వారు కోరుకున్నచోట ఇతర ఏర్పాట్లు చేసి.. రహస్యంగా వాటిని కెమెరాలలో చిత్రీకరించి బెదిరించాడట. ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసి.. ఓ ఛానల్ అధినేత వీక్ పాయింట్ పట్టాడట. ఆయన వీక్నెస్ అయితే ఉన్నారో ఆమెతో చెప్పించుకుని ఆ చానల్లోకి ఎంట్రీ ఇచ్చాడట. చేపకు చోటిస్తే తిమింగలాన్ని మింగినట్టు.. ఏకంగా ఛానల్లో ఉద్యోగ అవకాశమిస్తే.. ఉద్యోగుల మీద పెత్తనం చేసే స్థాయికి ఇతడు ఎదిగాడట. ఇప్పుడు ఇతడు మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏతావాతా ఇప్పుడు సదరు పెట్రోల్ బంక్ లో పనిచేసి.. ఇప్పుడు జర్నలిస్ట్ అయిన ఆయన ఆస్తుల విలువ 100 కోట్ల పై మాట. ఇవి కాకుండా ఖరీదైన స్థలాలు.. ఖరీదైన భవంతులు ఉన్నాయట. అన్నట్టు ఆ ఛానల్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న వారు ఇప్పటికీ సొంత ఇంటిని కొనుగోలు చేయలేదు. ఈఎంఐ ల మీద బతుకుతున్నారు. ఇతడు మాత్రం ఆ చానల్ అమ్మితే కొనాలని చూస్తున్నాడు.. ఒక జర్నలిస్టుకి.. ఎర్నలిస్టుకి ఎంత తేడా ఉంటుందో ఇలాంటి వాటిని చూసి చెప్పొచ్చు.