ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ ఎప్పటికప్పుడు నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. ఈ నివేదికలో సంచలన విషయాలను బయటపెడుతూ ఉంటుంది. తాజాగా ఈ సంస్థ దేశంలో ఉన్న ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు.. వారు సంపాదించిన ఆస్తులు.. వారి మీద నమోదైన కేసులు.. ఇతర వ్యవహారాల మీద ఒక నివేదికను బయటపెట్టింది.
దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్య మంత్రుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.. ఈ నివేదిక ఆధారంగా దేశంలో 31 మంది ముఖ్యమంత్రి ఆస్తుల మొత్తం విలువ దాదాపు 3660 కోట్లు. ఇందులో కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ ఆస్తుల విలువ 1413 కోట్లు కావడం విశేషం. సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో శివకుమార్ నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నారు. 931 కోట్ల ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ స్థానంలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కి 30 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈయన ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు.
ఆస్తులపరంగా అత్యంత తక్కువ ఉన్న వారి జాబితాలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తులు కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి 85 లక్షల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కోటి రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు.
ఇక కేసుల విషయంలో మొత్తం 14 మంది ముఖ్యమంత్రి మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద ఏకంగా హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏకంగా 89 కేసులు ఉన్నాయి.. రెండో స్థానంలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నారు. ఈయన మీద 29 కేసులు ఉన్నాయి. డీకే శివకుమార్ మీద 19 కేసులు ఉన్నాయి. ఈయన మూడో స్థానంలో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద 19 కేసులు ఉన్నాయి ఈయన నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఏడీఆర్ నివేదిక ఆధారంగా 31 మంది ముఖ్యమంత్రులలో 17 మంది 51 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారు. 8 మంది 41 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉన్నారు.