Viswanath and Sons First Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్య తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకన్నాడు. వరుస సినిమాలతో తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పుడు చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం ‘వీరభద్రుడు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూర్య ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ ని కొంతమంది సినిమా పెద్దలైతే వీక్షించారు. వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఒక డీసెంట్ హిట్ సినిమాగా నిలవబోతుందనే వార్తలైతే వస్తున్నాయి… విశ్వనాథ్ తన కొడుకు కోసం చేసే పోరాటమే ఈ సినిమాగా తెలుస్తుంది. తన కొడుకుకి అనారోగ్య పరిస్థితి రావడం దానిని ఆయన ఎలా చక్కబెట్టుకున్నాడు అలాగే తన బిజినెస్ లను ఎలా నిలుపుకున్నాడు.
తనకంటే ఏజ్ లో చిన్నదైనా అమ్మాయి తనను ప్రేమిస్తే ఆమెకు ఎలా సమాధానం చెప్పాడనేదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని వెంకీ అట్లూరి చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాని చూసిన కొంతమంది ఇండస్ట్రీ పెద్దలైతే ఈ సినిమా సూర్య కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందంటూ చెబుతున్నారు. పర్ఫామెన్స్ వైజ్ గా చూసుకుంటే సూర్య ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తుంటాడు.
అలాగే కంటెంట్ వైజ్ గా కూడా ఈ సినిమా ప్రేక్షకులకు చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి… వెంకీ అట్లూరి సైతం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? ప్రేక్షకులందరి మన్ననలను పొందుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక వారం రోజులు పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…