Motorola Edge 60 Pro : మోటోరోలా మిడ్ రేంజ్ సెగ్మెంట్ కస్టమర్ల కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ప్లేలిస్ట్ స్టూడియో, ఏఐ ఇమేజ్ స్టూడియో, ఏఐ సిగ్నేచర్ స్టైల్ వంటి ఎన్నో మోటో ఏఐ ఫీచర్ల సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా దుమ్ము, అధిక నీటి ఒత్తిడి నుంచి సేఫ్టీ కోసం ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్ కూడా లభించింది. వేపర్ కూలింగ్ ఛాంబర్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు కంపెనీ మూడేళ్ల వరకు ఓఎస్ అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ను కొనాలంటే ఎంత బడ్జెట్ ఉండాలి.. ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
Also Read : ఆలసించినా.. ఆశాభంగం.. మోటోరోలా పై భారీ తగ్గింపు.. నేడే త్వరపడండి..
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు
* కెమెరా: ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ Sony LYT 700C ప్రైమరీ కెమెరా, దానితో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మాక్రో కెమెరా, 50x ఏఐ సూపర్ జూమ్ సపోర్ట్ లభిస్తుంది. ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
* ప్రాసెసర్: స్పీడ్, మల్టీటాస్కింగ్ కోసం మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
* బ్యాటరీ: 90 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 6000mAh పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్‌లెస్ ఛార్జ్ సపోర్ట్‌తో విడుదల చేశారు.
* డిస్‌ప్లే: ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7ఇంచుల డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ HDR10 ప్లస్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది.
భారతదేశంలో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర
మోటోరోలా కంపెనీ ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో రిలీజ్ అవుతుంది.. అవి 8GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999 కు లభిస్తుంది. అలాగే, 12GB/256GB వేరియంట్ రూ.33,999లకు లభిస్తుంది. ఫోన్ ప్రీ-బుకింగ్ ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్ల కోసం ప్రారంభమైంది.
ఈ ధరల రేంజ్ లో మోటోరోలా బ్రాండ్ ఈ ఫోన్ Realme GT 6T 5G (ధర రూ.33,999), Vivo V50e 5G (ధర రూ.30,999), Redmi Note 14 Pro Plus 5G (ధర రూ.31,999) వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.
Also Read : మోటారొలా నుంచి కొత్త గాడ్జెట్.. ధర చూస్తే షాకింగే..