Kia 7 Seater SUV : మనదేశంలో లగ్జర కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు చిన్న కార్లు కొన్న వారు సైతం ఇప్పుడు కాస్త ధర ఎక్కువైనా.. స్టైలిష్ గా ఉండే కార్ల వైపు చూస్తున్నారు. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు కొత్త కార్లను భారత మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. సాధారణంగా లగ్జరీ కార్లు అంటే టయోటా ఫార్చ్యునర్, స్కోడా కొడియాక్ కార్ల గురించి తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఈ కార్లకు గట్టి పోటీ ఇస్తూ.. ఇప్పుడు కియా ఆకర్షించే కార్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 4న కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది. దీంతో కియా కార్లు కొనేవారు పండుగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ కారు ఎలా ఉంటుందంటే?
ప్రస్తుత కాలంలో పెద్ద కుటుంబాలు కలిగిన వారు కాస్త విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా ఈ కొత్త కియా 7 సీటర్ ‘త్రీ-రో’బెస్ట్ ఆప్షన్ గా ఉండనుంది. ఎస్ యూవీ వేరియంట్ లో రాబోతున్న ఈ కారు లో హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఉండనుంది. 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పనిచేసే ఈ ఇంజిన్ కు 238 బీహెచ్ పీ పవర్ ఉండనుంది. అలాగే 380 ఎన్ ఎం టార్క్ రిలీజ్ చేసే ఈ కారులో ఎలక్ట్రిక్ మోటార్ కలయిక కూడా ఉండనుంది. దీంతో లాంగ్ జర్నీ చేసేవారికి మంచి అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా పెద్ద కుటుంబ సభ్యులు 7 నుంచి 8 మంది విలాసవంతంగా ప్రయాణం చేయడానిక ఇందులో బూట్ స్పేస్ ను అధికంగా ఉంచారు.
ఈ కారులో ఫీచర్స్ కూడా ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. 12.3 అంగుళాలా డిజిటల్ డిస్ ప్లే స్క్రీన్లు ఉండడంతో డ్రైవర్ కు ఇది అనుగుణంగా ఉండనుంది. అలాగే సేప్టీ కోసం అడాస్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, ఏఐ అసిస్టెంట్ తో కొత్త హంగులను తీర్చి దిద్దారు. రూ.40 నుంచి రూ. 45 లక్షల్లో అందుబాటులోకి వచ్చే ఈ కారు ఉన్నతస్థాయి కస్టమర్లకు విపరీతంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కియా కార్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త కారు అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి.