Taiwan AI Industry: ఉచిత పథకాలు మనదేశంలోనే కాదు.. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా అమలు చేస్తున్నారు.. కాకపోతే ఈ పథకాల అమలు తీరు కాస్త చిత్రమైనది. ఇదేమీ ఓట్లను దండుకునే మార్గం కాదు. ప్రజలను సోమరులను చేసే ప్రయత్నం కాదు. కేవలం ప్రజలకు ఇస్తున్న గుర్తింపు..
ప్రస్తుత కాలంలో ఏఐకి ఇప్పుడు తమ డిమాండ్ ఉంది. ఏఐ టెక్నాలజీ పనిచేయాలి అంటే సెమీ కండక్టర్లు చాలా అవసరం. ఐటీ రంగాలలో జపాన్, అమెరికా, ఇండియా, చైనా కంటే ఆరి తేరిన దేశంగా తైవాన్ కు పేరుంది.. పైగా తైవాన్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఉపయోగపడే అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. తైవాన్ దేశంలో అక్కడి ప్రజల్లో మేదో సంపత్తి అధికంగా ఉంటుంది. పైగా వారిలో కష్టపడి పనిచేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అక్కడి విద్యాసంస్థలలో చెప్పే పాఠాలు పరిశ్రమల అవసరాలు తీర్చుతూ ఉంటాయి. అందువల్లే అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు.
ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా.. ఏఐ డిమాండ్ కు అనుగుణంగా సెమీ కండక్టర్లు తైవాన్ దేశంలో తయారవుతూ ఉంటాయి. వీటి తయారీ వల్ల తైవాన్ దేశానికి భారీగా లాభాలు వస్తున్నాయి. అక్కడ కంపెనీలు విపరీతంగా అభివృద్ధి బాట సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన లాభాలను ప్రజలతో పంచుకోవడానికి నిర్ణయించినట్టు తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ టే ప్రకటించారు.
ఆయన ప్రకటన ప్రకారం ఆదేశ ప్రజలందరికీ 10,000 న్యూ తైవాన్ డాలర్స్ ను అందిస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల తైవాన్ దేశం 70 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజలకు ఒక్కొక్కరికి 30 వేల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం 2027లో 70000 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది. దీని ద్వారా ప్రజల్లో టెక్నాలజీ మీద సానుకూల దృక్పథం ఏర్పడుతుందని.. తమ పిల్లల్ని సాంకేతిక పరికరాల తయారీ విభాగానికి సంబంధించిన కోర్సులు చదివిస్తారని.. తద్వారా తైవాన్ దేశ ఆర్థిక అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని అక్కడి పరిపాలకులు భావిస్తున్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల కోసం.. అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం చాలామంది పరిపాలకులు ప్రజలకు ఉచిత పథకాలను ఎరగా వేస్తుంటారు. కానీ, తైవాన్ దేశం మాత్రం.. దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రజలకు డబ్బులు ఇస్తోంది. దీనిని బట్టి తైవాన్ పరిపాలకుల ముందుచూపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.