Lassi Seller Success Story: చాలామంది ఉద్యోగాలు లేవు.. వ్యాపారం కలిసి రావడం లేదు.. తమ అదృష్టం బాగాలేదు.. అంటూ తమ జీవితం గురించి తామే వంచించుకుంటూ ఉంటారు. కానీ కష్టపడి చిన్న పనిని ప్రారంభించినా.. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి వెళ్లే అవకాశాలు చాలావరకు ఉంటాయి. ఇప్పటికే చాలామంది మహామహులు కిందిస్థాయి నుంచి అత్యున్నత శిఖరానికి ఎదిగి అందరికీ ఆదర్శంగా మారారు. అయితే ఇప్పుడు లస్సీ ఆమె ఓ వ్యక్తి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. అది ఎలాగో చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో లస్సీ ఆమె వ్యక్తి కనిపిస్తాడు. అతను చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ అతడు నెలకు రూ. 80000 నుంచి రూ. 90,000 వరకు ఆదాయాన్ని ఆర్థిస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది ఆయన చెప్పిన సత్యమే. అంతేకాకుండా అతను ఒక పెద్ద భవనాన్ని కూడా నిర్మించినట్లు చెబుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారికి సైతం ఇంత జీతం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ లస్సి ఆమె ఈ వ్యక్తికి ఇంత ఆదాయం రావడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎలా సాధ్యం అని ఆయనను కొందరు మీడియా వ్యక్తులు అడగగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పాడంటే?
కష్టపడితే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని.. నా జీవితంలో కూడా అదే జరిగిందని అంటున్నాడు.. తాను చిన్న వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయానని.. దీంతో కుటుంబ భారం మొత్తం తనపై పడిందని చెప్పుకొచ్చాడు.. దీంతో తోబుట్టువుల పెళ్లిళ్లు చేసి.. తన పెళ్లి చేసుకుని. ఇల్లు నిర్మించుకున్నారని చెప్పాడు. అయితే తనపై కుటుంబ భారం పడిన సమయంలో రోజుకు రూ.250 ఆదాయం వచ్చేదని.. అప్పటినుంచి నిరంతరం కష్టపడుతూ.. తన వృత్తిని అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పాడు. నాణ్యమైన లస్సీని అందిస్తూ.. అందరి ఆదరణతో తన వ్యాపారం బాగా సాగుతుందని చెప్పాడు.
ఇంత ఆదాయం వస్తున్నప్పటికీ అతను ఇప్పటికీ సైకిల్ పైనే లస్సీని విక్రయిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన నేటి యువతకు కొన్ని సూచనలు చేశాడు. కష్టపడాలన్న తత్వంతో పాటు సాధించాలన్న దృఢ సంకల్పం ఉంటే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పాడు. చిన్న పని, పెద్దపని అంటూ ఏది ఉండదని.. చేసే వృత్తిని నమ్ముకుంటూ ముందుకు వెళితే కచ్చితంగా అనుకున్న విజయాలను సాధిస్తారని ఆయన చెబుతున్నాడు. ఈ సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై చాలామంది స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు..
View this post on Instagram