Hydrogen Trains in India: రోజురోజుకు మనుషుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఉపయోగించే సరుకులు కూడా అదే స్థాయిలో ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి అప్పుడు సరుకు రవాణా చేయడం కష్టతరంగా మారుతుంది. దీనికి తోడు రైళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
మనదేశంలో అనేక విధాలుగా విద్యుత్ తయారవుతున్నప్పటికీ.. ఎక్కువగా థర్మల్ విధానంలోనే కరెంటు తయారు చేస్తున్నారు. థర్మల్ కరెంటు తయారీకి బొగ్గు.. నీరు అవసరం. బొగ్గు అనేది ఒక పరిమితమైన వనరు. ఇలానే తవ్వుకుంటూ పోతే భవిష్యత్తులో బొగ్గు అనేది ఉండదు. అప్పుడు భవిష్యత్ తరాలు ఇబ్బంది పడుతుంటాయి. అందువల్లే సరికొత్త ఆవిష్కరణ చేశారు శాస్త్రవేత్తలు.
విద్యుత్ కాకుండా.. బొగ్గును మండించడం ద్వారా కాకుండా.. హైడ్రోజన్ ద్వారా రైళ్ళను నడిపిస్తున్నారు.. ప్రపంచంలో ఇప్పటికే జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాలలో హైడ్రోజన్ తో నడిచే రైళ్లు ఉన్నాయి. అక్కడ అవి విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. డీజిల్ రైళ్లకు ఇవి ప్రత్యామ్నయం. వీటివల్ల ఇంధనం ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం ఉండదు. శబ్ద కూడా తక్కువ. కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఇంధనం నింపొచ్చు.. దీనివల్ల ఒక్కసారి నింపితే రైలు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది.
మనదేశంలో సరుకు రవాణా రైళ్ల ద్వారానే అధికంగా సాగుతూ ఉంటుంది. ప్రయాణికులు కూడా కార్యకలాపాలను రైళ్ల ద్వారానే సాగిస్తూ ఉంటారు. రైల్వే శాఖ రైళ్లను నడపడానికి విద్యుత్.. డీజిల్ అధికంగా వినియోగిస్తోంది.. వీటి ఖర్చు కూడా అధికంగా ఉంటున్నది. అందువల్లే హైడ్రోజన్ ఆధారంగా మన దేశంలో కూడా రైళ్లు నడపబోతున్నారు. ఇప్పటికే దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ చివరి దశ ట్రయల్ పూర్తయింది. హర్యాన రాష్ట్రంలోని జింద్ , సోనిపాట్ మార్గంలో 120 కిలోమీటర్ల వేగంతో ఈ రైలును పరీక్షించారు. అది విజయవంతం కావడంతో.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. హైడ్రోజన్ రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే రైల్వే శాఖ మీద ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. మరిన్ని కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతుంది.
