Homeఅంతర్జాతీయంMyanmar President Meets Narendra Modi: అజిత్ దోవల్ ఫోన్ .. బర్మా అధ్యక్షుడు మోడీని...

Myanmar President Meets Narendra Modi: అజిత్ దోవల్ ఫోన్ .. బర్మా అధ్యక్షుడు మోడీని కలిశారు.. చైనా తల పట్టుకుంది.. ఇంతకీ ఏంటి ఈ కథ

Myanmar President Meets Narendra Modi: అమెరికా ఏం చేస్తుంది.. తనకు ప్రయోజనాలు కలిగించే అంశంలో మాత్రమే వేలుపెడుతుంది. అవసరమైతే ఆ దేశాలతో అనవసరమైన యుద్ధం చేసి తన పంతం నెగ్గించుకుంటుంది. ప్రపంచ ప్రయోజనాల విషయంలో.. ప్రపంచానికి శాంతి కలిగించే విషయంలో అమెరికా వేలు పెట్టదు. కనీసం అటువైపుగా చూడదు. ఎందుకంటే అమెరికా తీరు అలా ఉంటుంది కాబట్టి. భారత్ అలా కాదు. అమెరికా మాదిరిగా ప్రయోజనాలు ఉండవు .. ప్రపంచం బాగుంటే చాలు అనుకునే టైపు. […]

Myanmar President Meets Narendra Modi: అమెరికా ఏం చేస్తుంది.. తనకు ప్రయోజనాలు కలిగించే అంశంలో మాత్రమే వేలుపెడుతుంది. అవసరమైతే ఆ దేశాలతో అనవసరమైన యుద్ధం చేసి తన పంతం నెగ్గించుకుంటుంది. ప్రపంచ ప్రయోజనాల విషయంలో.. ప్రపంచానికి శాంతి కలిగించే విషయంలో అమెరికా వేలు పెట్టదు. కనీసం అటువైపుగా చూడదు. ఎందుకంటే అమెరికా తీరు అలా ఉంటుంది కాబట్టి.

భారత్ అలా కాదు. అమెరికా మాదిరిగా ప్రయోజనాలు ఉండవు .. ప్రపంచం బాగుంటే చాలు అనుకునే టైపు. అలాగని తనను ఇబ్బంది పెట్టే దేశాలను భారత్ వదిలిపెట్టదు. అవసరమైతే అంతు చూస్తుంది. అంతానికి పోరాడుతుంది. బర్మా విషయంలో కూడా భారత్ అలానే వ్యవహరించింది. మన దేశానికి వ్యతిరేకమైన శక్తులను చైనా పెంచి పోషించి బర్మా తోలేది. బర్మా కేంద్రంగా ఆ శక్తులు మనమీద దాడులు చేసేవి. కాలా అనుగుణంగా భారత్ మారింది. ముఖ్యంగా గడిచిన 12 సంవత్సరాల కాలంలో భారత్ ఇంటి దొంగలను హతమార్చే పని పెట్టుకుంది.

బర్మాలో దాగివున్న వ్యతిరేక శక్తులను తొక్కినార తీసింది. దీనికి బర్మా సహాయం కూడా తీసుకుంది. బర్మాలో ఒక దరిద్రమైన వ్యవస్థ ఉంది. అక్కడ సైనిక అధికారులే నేరుగా అధికారంలోకి వస్తుంటారు. గతంలో నోబెల్ శాంతి బహుమతి విజేత సూకీ బర్మా అధిపతి అయింది. అయితే అక్కడి సైనిక అధికారులు ఆమెను జైల్లో వేశారు. ఇప్పటికి జైలు నుంచి ఆమె విడుదల కాలేదు.

ఇటీవల బర్మాకు కొత్త అధినేత వచ్చారు. ఆయన పేరు ఆంగ్ హ్లాయింగ్. ఆయనకు మన రక్షణ సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ చేశారు. వెంటనే బర్మా అధినేత ఇండియాకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత అనేక రకాల చర్చలు జరిగాయి. అనంతరం సానుకూల దృక్పథంతో బర్మా అధిపతి వెళ్ళిపోయారు.. అజిత్ దోబల్ ఫోన్ చేయడానికి ప్రధాన కారణం.. ఇండియా, బర్మా, థాయిలాండ్ వరకు నిర్మించే కాలదాన్ ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చించారు. దీనివల్ల భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు, దేశాలకు సరుకులు రవాణా చేయడం ఈజీ అయిపోతుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతారా.. లేదా అనే విషయం మీద క్లారిటీ తీసుకోవడానికి బర్మా అధినేతను ఇండియాకు పిలిపించారు.

చైనా మాటలు నమ్మకుండా.. చైనా చెప్పినట్టు వినకుండా బర్మా అధినేత ఇండియాకు వచ్చారు. వాస్తవానికి బర్మాకు అధినేత అయిన తర్వాత ఆయన బీజింగ్ వెళ్లాల్సి ఉండేది. అజిత్ దోవల్ నుంచి ఫోన్ రాగానే బర్మా అధినేత నేరుగా ఇండియాకు వచ్చారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అనేక రకాల చర్చలు జరిపారు. చివరికి సానుకూల దృక్పథంతో బర్మా తిరిగి వెళ్ళిపోయారు. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలలో చైనా ముందుంటుంది. కానీ ఈసారి చైనాను మించిపోయింది భారత్. ఫారిన్ పాలసీలో సరికొత్త మార్పు తీసుకురావడంతో చైనా తలలు పట్టుకుంటుంది. ఎందుకంటే కాలాదాన్ అందుబాటులోకి వస్తే లాజిస్టిక్ రంగంలో భారత్ తిరుగులేని స్థానంలో ఉంటుంది. అది తెలిసే చైనా తెగ ఉడికిపోతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper