Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీHuman Brain: పెరుగుతున్న మనిషి మెదడు సైజు.. ఏం జరుగబోతోంది?

Human Brain: పెరుగుతున్న మనిషి మెదడు సైజు.. ఏం జరుగబోతోంది?

మొదడు నిర్మాణంలో భాగమైన వైట్‌ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పోక్యాంపస్‌ సైజు పెరిగినట్లు కూడా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఇలా మెదడు సైజు పెరగడం వలన ప్రయోజనాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

Human Brain: మనిషి మెదడు సైజుపై ప్రతిభ ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతారు. పరిమాణం ఎక్కువ ఉన్నవారికి ప్రతిభ ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఆల్కహాల్, స్మోకింగ్, శీతల పానీయాలు సేవించడం వలన మెదడు పరిమాణం తగ్గుతున్నట్లు ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తాజాగా మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డేవిస్‌ హెల్త్‌కు చెందిన పరిశోధకులు మానవ మెదడుపై చేసిన అధ్యయనంలో కీలక విషయాలను గుర్తించారు. వాటిని జామా న్యూరాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు.

పెరుగుదల ఇలా..
తాజా అధ్యయనం ప్రకారం.. 1930లో పుట్టినవారితో పోలిస్తే 1970లో పుట్టిన వారి మొదడు సైజు 6.6 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 1999 నుంచి 2019 మధ్యకాలంలో 3,226 మంది మెదడును ఎంఆర్‌ఐ తీసి అధ్యయనం చేయగా.. 1930లో పుట్టిన వారి మెదడు సగటు 1,234 మిల్లీలీటర్లు ఉండగా, 1970లో పుట్టిన వారి మెదడు 1,321 మిల్లీ లీడర్లు ఉన్నట్లు గుర్తించారు.

వీటిలో పెరుగుదల..
మొదడు నిర్మాణంలో భాగమైన వైట్‌ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పోక్యాంపస్‌ సైజు పెరిగినట్లు కూడా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఇలా మెదడు సైజు పెరగడం వలన ప్రయోజనాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. వయసు పెరిగే వారిలో మతిమరుపు, చిత్త వైకల్యం ముప్పు తగ్గుతుందని తెలిపారు. ఇదే సమయంలో మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని మానసిక ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలో గుర్తించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper