Forgetful People are Geniuses : మతిమరుపు అనేది ఒక వయసుకు వచ్చిన తర్వాత కచ్చితంగా వస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఇప్పటి కాలంలో ఒక వయసు కంటే ముందుగానే మతిమరుపు వస్తోంది. పెట్టిన వస్తువులను మర్చిపోవడం.. ఆ వస్తువులను గుర్తుకు తెచ్చుకోవడానికి హడావిడి చేయడం.. దానిని పదేపదే గుర్తు చేసుకుంటూ ఇబ్బంది పడటం వంటి సందర్భాలు ప్రతి ఒక్కరిలోనూ ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి కారణాలేంటి? అనే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతాయి. కాకపోతే మతిమరుపు ఉందని వైద్యుడు వద్దకు వెళ్లి చెప్తే ఇబ్బందిగా ఉంటుందని.. చాలామంది సైలెంట్ గా ఉంటారు. పరిస్థితి తీవ్ర రూపు దాల్చితే తప్ప వైద్యుడి వద్దకు వెళ్లరు. అయితే మతిమరుపు అనేది ఒక రుగ్మత అని.. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటిదాకా మనకు తెలుసు. అయితే మతిమరుపు కూడా మంచిదేనని.. దానివల్ల అనేక లాభాలు ఉంటాయని తాజా అధ్యయనంలో తెలిసింది.
Also Read : అశ్విన్, రోహిత్, విరాట్ బాటలో.. రిటైర్మెంట్ పై బాంబు పేల్చిన బుమ్రా!
ఉదాహరణకు అప్పట్లో సంచలన విజయం సాధించిన ఓ సినిమాను తీసుకుంటే.. అందులో మెమరీ లాస్ తో సూర్య బాధపడుతుంటాడు. తనకు ఏ విషయం గుర్తు లేకపోవడంతో.. వాటన్నిటిని ఫోటోలు తీసుకొని.. ఎప్పటికప్పుడు చూసుకుంటాడు. పదే పదే గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.. అయితే ఈ గుర్తు తెచ్చుకునే ప్రక్రియలో సూర్య అత్యంత సృజనాత్మకంగా ఆలోచిస్తుంటాడు. చివరికి తన శరీరంపై కూడా పచ్చబొట్లు పొడిపించుకొని.. మర్చిపోయిన విషయాలను పదేపదే గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇది చూసేందుకు ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ.. తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందడానికి అతడు చేసే ప్రయత్నం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
మతిమరుపు ఉన్న వాళ్ళు.. తాము మర్చిపోయిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో హడావిడి చేస్తుంటారు. అయితే తీవ్రమైన మతిమరుపు ఆరోగ్యానికి ఇబ్బందికరమైనప్పటికీ.. కొంతమేర మతిమరుపు మాత్రం ఆరోగ్యానికి మంచిదట. తాజా అధ్యయనంలో ఇది తెలిసింది. కొంతమేర మతిమరుపు ఉన్నవారు అత్యంత సృజనాత్మకంగా ఆలోచిస్తారట. వారు సృజనాత్మకంగా ఆలోచించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారట. అందువల్లే చిన్న చిన్న వస్తువులను పెట్టిన విషయాన్ని మర్చిపోతుంటారట. చిన్న చిన్న విషయాలను కూడా మెదడులో స్టోర్ చేసుకోకుండా వదిలేస్తారట. అందువల్లే వారికి ఆ ఇబ్బంది ఎదురవుతుందట. “ఒక స్థాయి మతిమరుపు మంచిదే. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇలా ఉంటుంది. దీనివల్ల వారు క్రియేటివ్ గా థింక్ చేస్తుంటారు. అయితే ఇది లోపం కాదు. కేవలం చురుకైన, ఉత్తేజ కరమైన ఊహాశక్తి వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని ఎప్పుడు కూడా ఇబ్బందిగా భావించకూడదు. రుగ్మత అని అనుకోకూడదని” అధ్యయనంలో పేర్కొన్నారు.