best phones under 15000 : ప్రస్తుత కాలంలో మొబైల్ కొనే ముందు బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుంటున్నారు. కొంత మంది నిర్ణీత బడ్జెట్ ను ఏర్పాటు చేసుకొని ఆలోపే కొనాలని చూస్తారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మొబైల్స్ తీసుకువస్తుంటాయి. అయితే తక్కువ ధర మొబైల్స్ లో ఫీచర్స్, డిస్ ప్లే వంటివి నాణ్యంగా ఉండకపోవచ్చన్న అనుమానాలు ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లతో పాటు అనుగుణంగా ఉండే డిస్ ప్లే ఉన్న ఫోన్లను రూ.15,000 లోపు అందిస్తున్నాయి. అలాంటి మొబైల్స్ లో ఈ మూడింటి గురించి తెలుసుకుందాం..
చైనా కంపెనీకి చెందిన రియల్ మీ నుంచి బడ్జెట్ మొబైల్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. వీటిలో రియల్ మీ పీ 1 5జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీని ధర రూ. 13,000 నుంచి రూ. 14,999 వరకు విక్రయిస్తుంటారు. అయితే ఇందులో 6.67 ఎమోల్డ్ డిస్ ప్లే తో పాటు అట్మాస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉన్నాయి. ఈ మొబైల్ లో 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంది.
పోకో కంపెనీకి చెందిన ఎం 7 ప్రో 5జీ మొబైల్ కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.14,999గా ఉంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే ను చూడొచ్చు. 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో ఉన్న ఇందులో ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను చూడొచ్చు. మీడియా టెక్ డైమెన్సిటీ 7925 ఉండగా.. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది.
చివరగా శాంసంగ్ కు చెందిన గెలాక్సీ ఎఫ్ 16 5 జీ మొబైల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ రూ.12,499 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో 6.7 అంగుళాల ఎమెల్డ్ డిస్ ప్లే ఉండనుంది. 90 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో ఉన్న ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. 50 మెగా పిక్సెల్ తో కూడిన కెమెరాతో పాటు 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను చూడొచ్చు.