Flipkart Big Billion Days Sale 2026 : ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిలోనే అత్యంత కీలకమైన ఫెస్టివ్ సేల్‌గా భావించే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్‌లో జరగనున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ సహా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను టీజ్ చేస్తోంది.
అక్టోబర్ 9 నుంచి సేల్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9న అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులతో పాటు అర్హత కలిగిన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభించనుంది. ఇప్పటికే ఎర్లీ బర్డ్ డీల్స్ పేరుతో కొన్ని ఫోన్లపై అందుబాటులో ఉండే ఆఫర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడిస్తోంది.
ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్?
ఈసారి సేల్‌లో ప్రధాన ఆకర్షణగా ఐఫోన్ 17 నిలిచే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ టీజర్‌లో ఈ ఫోన్ ధరను రూ. 7X,XXX రేంజ్‌లో చూపించింది. అయితే ఖచ్చితమైన సేల్ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఐఫోన్ 17 256GB వేరియంట్ భారత్‌లో తొలుత రూ.82,900 ధరతో విడుదల కాగా, ప్రస్తుతం అధికారిక ధర రూ.99,900గా ఉంది. దీంతో సేల్‌లో లభించే ధరపై ఆసక్తి నెలకొంది.
శాంసంగ్, గూగుల్ ఫోన్లకు కూడా ఆఫర్లు
Samsung Galaxy S25, Galaxy S25 FE మోడళ్లకు కూడా ప్రత్యేక సేల్ ధరలు ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే Google Pixel 11, Pixel 10a వంటి ఫోన్లు కూడా సేల్ ప్రమోషన్‌లో కనిపిస్తున్నాయి.
ఇవే కాకుండా Vivo T5x 5G, Realme P4 Lite 5G, Realme P4 5G, Motorola Signature, Moto G37 Power వంటి మోడళ్లపై కూడా డిస్కౌంట్లు రానున్నాయి.
అదనంగా Realme P4X 5G, Samsung Galaxy F70e 5G, Infinix Hot 60i 5G+, OnePlus Ace 5G, Lava Virat V1 5G, Oppo K14x 5G, Nothing Phone 4a తదితర స్మార్ట్‌ఫోన్లు కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లతో అందుబాటులోకి రానున్నాయి.
బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గే ధరలు
స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లతో పాటు అదనపు పేమెంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఎంపిక చేసిన Axis Bank, ICICI Bank కార్డులతో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి.
అలాగే Super.money by Flipkart ద్వారా మొదటి లావాదేవీ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
అయితే ప్రస్తుతం ప్రకటించిన ధరలు, ఆఫర్లు పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. అక్టోబర్ 8, 9 తేదీల్లో సేల్ ప్రారంభమైన తర్వాత ఆయా ఫోన్ల ఖచ్చితమైన ధరలు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితర వివరాలు స్పష్టంగా తెలియనున్నాయి. కాబట్టి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ కీలక అవకాశంగా మారే అవకాశం ఉంది.