Google Chrome : ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో అరచేతిలో ఉన్న ఫోన్ చెబుతోంది. స్మార్ట్ ఫోన్ వాడేవారు కచ్చితంగా గూగుల్ క్రోమ్ ను ఉపయోగిస్తుంటారు. కొంతమంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి వెబ్ బ్రౌజర్ లో తమకు కావలసిన సమాచారాన్ని సెర్చ్ చేస్తుంటారు. అటు గూగుల్ క్రోమ్.. ఇటు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో కొన్ని రకాల సమాచారాలను మనం శోధించలేం. ప్రత్యేకమైన సమాచారాన్ని సేకరించాలంటే కొన్ని బ్రౌజర్స్ ఉన్నాయి. అవి గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఏడ్జ్ ను మించి అనే విధంగా డాటా అందిస్తాయి. ఇవి అందించే సమాచారం కూడా చాలా బాగుంటుంది. కొన్ని స్పెషల్ ఐటమ్స్ ని కూడా వీటిలో సెర్చ్ చేయవచ్చు. అపరిమితమైన సమాచారాన్ని పొందవచ్చు.
ఆర్క్ బ్రౌజర్ (ARC)
ఇది మైక్రో సాఫ్ట్ ఎడ్జ్ కంటే ఆర్క్ బ్రౌజర్ బాగుంటుంది. ఇందులో సెర్చ్ చేసినప్పుడు విలువైన సమాచారాన్ని అత్యంత వేగంగా ఇస్తుంది. వ్యక్తిగత భద్రతను కాపాడుతుంది. గోప్యతను పరిరక్షిస్తుంది. క్రోమ్, ఎడ్జ్ కంటే ప్రత్యామ్నాయం కావాలనుకునే వారికి ఇది అత్యుత్తమమైన ఎంపిక.
మొజిల్లా ఫైర్ ఫాక్స్ ( Mozilla Firefox)
ఇది ఒక ఓపెన్ సోర్స్ బ్రౌజర్. ఇందులో అడ్వాన్సుడ్ యాంటీ ఫింగర్ ప్రింటింగ్ అనే ఆప్షన్ ఉంది. Enhanced tracking protection అనే ఆప్షన్ మీ వ్యక్తిగత గోప్యతను పరిరక్షిస్తూ ఉంటుంది. అందువల్ల ఇతరులు మీ యాక్టివిటీని చూడలేరు. కనీసం ట్రాక్ కూడా చేసేందుకు వీలుపడదు. యూజర్ ప్రైవసీని కాపాడటంలో Mozilla Firefox దిట్ట. మోసపూరితమైన వెబ్ సైట్ ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది.. క్రోమ్, ఎడ్జ్ కంటే సరికొత్త సెర్చింగ్ అనుభూతిని ఇస్తుంది.
ఓపేరా జీ ఎక్స్ (Opera GX)
ఇది గేమర్ల కోసం ఏర్పాటయింది. దీన్ని సులువుగా బ్రౌజింగ్ చేయవచ్చు. సీపీయూ, మెమొరీ, నెట్వర్క్ వంటి వాటి వినియోగంపై పరిమితిని దీని ద్వారా నిర్ణయించవచ్చు. దీనికి ఏఐ సపోర్టు లభిస్తుంది. బ్రౌజింగ్ అనేది అత్యంత వేగంగా ఉంటుంది.
డక్ డక్ గో (Duck duck Go)
దీని ద్వారా మీ సెర్చ్ హిస్టరీ అనేది రికార్డ్ అవ్వదు. కాబట్టి ట్రాక్ చేసే అవకాశం ఉండదు. దీనిలో మోసపూరితమైన సైట్స్ కనిపించవు. థర్డ్ పార్టీ ట్రాకర్లను ఇది ఈజీగా నిలిపిస్తుంది. Httts encryption లాంటివి ఈ బ్రౌజర్ లో ఉంటాయి.. automatic add block కూడా ఇందులో లభిస్తుంది.. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత కావాలనుకున్నవారు దీనిని వాడొచ్చు.
మిన్(MIN)
దీని ద్వారా బ్రౌజింగ్ అత్యంత ఈజీగా చేయవచ్చు. ఇది అత్యంత వేగంతో రిజల్ట్ ఇస్తుంది. ముందుగానే డిఫాల్ట్ గా యాడ్స్, ట్రాకర్ ను నిషేధిత జాబితాలో పెడుతుంది. ఒక్కసారి దీన్ని వాడితే… మిగతా బ్రౌజర్ల జోలికి పోరు.