Homeవింతలు-విశేషాలుAI Hiring Humans: మనుషులను ఉద్యోగులుగా నియమించుకుంటున్న ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్!

AI Hiring Humans: మనుషులను ఉద్యోగులుగా నియమించుకుంటున్న ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్!

AI Hiring Humans: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మన తెలుగు పరిభాషలో చెప్పాలంటే కృత్రిమ మేధ. ఇప్పటివరకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనుషులు అత్యంత క్లిష్టమైన పనులను సులభంగా చేయడం మాత్రమే మనం చూసాం. అన్నింటి కంటే ముఖ్యంగా మన జీవితం మరిత సుఖవంతంగా మారడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయడం మనం గమనించాం. అయితే ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మారుతుంది. మనిషి కనిపెట్టిన ఈ సాంకేతిక పరిజ్ఞానం.. చివరికి మనిషినే ఉద్యోగులుగా మార్చుకునే స్థాయికి ఎదిగింది. […]

AI Hiring Humans: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మన తెలుగు పరిభాషలో చెప్పాలంటే కృత్రిమ మేధ. ఇప్పటివరకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనుషులు అత్యంత క్లిష్టమైన పనులను సులభంగా చేయడం మాత్రమే మనం చూసాం. అన్నింటి కంటే ముఖ్యంగా మన జీవితం మరిత సుఖవంతంగా మారడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయడం మనం గమనించాం. అయితే ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మారుతుంది. మనిషి కనిపెట్టిన ఈ సాంకేతిక పరిజ్ఞానం.. చివరికి మనిషినే ఉద్యోగులుగా మార్చుకునే స్థాయికి ఎదిగింది.

ఈ ఉపోద్ఘాతం చదువుతుంటే రోబో సినిమాలో.. చిట్టి అనే హ్యూమనాయిడ్ రోబో మనుషుల మాదిరిగా ఆలోచించి.. మనుషులనే చంపే క్రూరత్వాన్ని అలవరుచుకుంటుంది. అదంటే సినిమా కాబట్టి అలా రూపొందించారు. కానీ, ఆ సినిమా మాదిరిగానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులపై పెత్తనం సాగిస్తుండడం గమనార్హం.

మనుషులనేవారు కంప్యూటర్లకు ఆదేశాలిస్తుంటారు. ఇచ్చిన ఆదేశాలను కంప్యూటర్లు అమలు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు రెంట్ ఏ హ్యూమన్ . ఏఐ అనే వెబ్సైట్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యజమానిగా ప్రవర్తిస్తుంటాడు. అంతేకాదు పనులు చేయడం.. దానికోసం మనుషులను కూలీలుగా లేదా కార్మికులుగా మార్చడం.. వారిని అద్దెకు తీసుకోవడం వంటివి ఈ ప్రక్రియలో జరుగుతుంటాయి.

రెంట్ ఏ హ్యూమన్ అనే ఈ వేదిక సరికొత్త నినాదంతో తెరపైకి వచ్చింది. రోబోలకు మీ శరీరం కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గడ్డిని మీరు తాకుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ఆ గడ్డిని తాకలేదు అంటూ సరికొత్త నినాదాన్ని ఈ వేదిక తీసుకొచ్చింది. దీనిని స్క్రిప్టివ్ ఇంజనీర్ అలెగ్జాండర్ లైట్ ఫ్లో తయారు చేశారు. ఈయన ఉమా ప్రోటోకాల్ కు చెందిన వ్యక్తి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతమైన తెలివిని ప్రదర్శిస్తుంది. అయితే అది కేవలం డిజిటల్ స్క్రీన్ వరకే ఆగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం కృత్రిమమైన పనులు మాత్రమే చేయగలుగుతుంది. భౌతిక పరమైన క్రియలకు అది చాలావరకు దూరంగా ఉంటుంది. ఉదాహరణకు కిరాణ దుకాణం వద్దకు వెళ్లి సరుకులు తీసుకురావడం.. భౌతికంగా సంతకాలు చేయడం.. చివరికి ఒక డెలివరీ బాయ్ నుంచి వచ్చిన వస్తువులను కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తీసుకోలేదు…

మోడల్ కాంటెస్ట్ ప్రోటోకాల్ అనే విధానం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనిషిని వాడుకుంటుంది. ఆ మనిషిని ఒక క్లౌడ్ సర్వీస్ మాదిరిగా భావిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిబంధనలు పంపిస్తుంది. ఒక పనిని అప్పగిస్తుంది. ఆ పని పూర్తి చేసిన తర్వాత దానిని వాస్తవ దృవీకరణ చేస్తుంది. పని పూర్తయిన తర్వాత డబ్బులను క్రిప్టో కరెన్సీ రూపం లో ఇస్తుంది. ఇక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే మనిషి తయారు చేసిన యంత్రం యజమాని అవుతుంది. తన జ్ఞానాన్ని రంగరించి యంత్రాన్ని తయారు చేసిన మనిషి కూలీ అవుతున్నాడు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper