Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీ52 New Spy Satellites: భారత భద్రత మరింత పటిష్టం.. కొత్తగా 50 స్పై శాటిలైట్స్‌!

52 New Spy Satellites: భారత భద్రత మరింత పటిష్టం.. కొత్తగా 50 స్పై శాటిలైట్స్‌!

52 New Spy Satellites: ఇటీవల అమెరికా సైన్యం సైలెంట్‌గా వెనెజువెలాలో చొరబడి చడీ చప్పుడు లేకుండా అధ్యక్షుడి బెడ్‌రూంకు వెళ్లి అధ్యక్షుడు నియోలక్‌ మదురో, ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి న్యూయార్క్‌కు తీసుకెళ్లింది. ఈ ఆపరేషన్‌తో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇంత తేలికగా అమెరికా ఎలా చొరబడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా వద్ద ఏదో ఆయుధం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ దేశ భద్రతపై దృష్టిపెట్టాయి. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేశాయి.

భారత్‌ స్పై శాటిలైట్స్‌..
ఇక భారత్‌ కూడా సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయబోతోంది. ఇందుకోసం త్వరలో 50 అధునాతన స్పై ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. దేశ సరిహద్దులు, సముద్ర మార్గాలపై కఠిన నిఘా ఉంచే ఈ వ్యవస్థ మోదీ ప్రభుత్వం ఆవిష్కరణ. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పొరుగులు, ముఖ్యంగా సముద్ర భద్రతకు ఈ శాటిలైట్లు కీలకం. ప్రపంచంలో నాలుగు ముఖ్య ప్రాంతాల్లో గ్రౌండ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ డేటా సేకరణను బలోపేతం చేస్తుంది.

విశ్వవ్యాప్తంగా గ్రౌండ్‌ స్టేషన్లు..
పశ్చిమాసియా (మిడిల్‌ ఈస్ట్‌), ఆగ్నేయాసియా, యూరోపియన్‌ స్కాండినేవియా ప్రాంతాల్లో గ్రౌండ్‌ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ స్టేషన్లు 50 శాటిలైట్లతో అనుసంధానమై, రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్‌ అందిస్తాయి. సరిహద్దు ఉల్లంఘనలు, సైనిక ఉద్దేశాలు, సముద్ర అంతరాయాలను ముందుగానే గుర్తించి భద్రతా బలగాలకు సమాచారం అందిస్తాయి.

వ్యూహాత్మక ప్రయోజనాలు..
చైనా–పాక్‌ల పొరుగు కుట్రలు, బంగ్లాదేశ్‌ సరిహద్దు ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల్లో ఆధిపత్య పోరులకు ఈ వ్యవస్థ ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది. ఉపగ్రహాలు అధిక రిజల్యూషన్‌ ఇమేజరీ, రాడార్‌ సెన్సార్‌లతో సైనిక కదలికలు, ఆయుధాల మోహరింపు, అక్రమ రవాణాను ట్రాక్‌ చేస్తాయి. దీని ఫలితంగా భారత్‌ రక్షణ వ్యవస్థ ఆధునికీకరణకు గణనీయమైన ఊరట లభిస్తుంది.

ఈ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ భారత్‌ను స్పేస్‌ ఇంటెలిజెన్స్‌లో అగ్రస్థానంలో నిలబరుస్తుంది. పొరుగు దేశాల చర్యలను ముందుగానే ఊహించి, సైనిక ప్రతిస్పందనను వేగవంతం చేస్తుంది. మిడిల్‌ ఈస్ట్, ఆగ్నేయాసియా వంటి విమాన ప్రాంతాల్లో స్టేషన్లు అంతర్జాతీయ సహకారాన్ని పెంచుతూ, భారత విదేశాంగ వ్యూహానికి కూడా బలం చేకూరుస్తాయి. దీర్ఘకాలంలో ఈ పద్ధతి దేశ భద్రతను మరింత మట్టిగా చేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular