Homeఅంతర్జాతీయంDonald Trump: గ్రీన్‌లాండ్‌పై వెనక్కు తగ్గిన ట్రంప్‌.. కారణాలు ఇవే!

Donald Trump: గ్రీన్‌లాండ్‌పై వెనక్కు తగ్గిన ట్రంప్‌.. కారణాలు ఇవే!

Donald Trump: వెనెజువెలా అధ్యక్షుడిని అమాంతం ఎత్తుకొచ్చేలా సైలెంట్‌ ఆపరేషన్‌ నిర్వహించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. నిన్నటి వరకు తన దృష్టి మొత్తం గ్రీన్‌లాండ్‌పై పెట్టారు. ఎవరెన్ని విధాలుగా నచ్చజెప్పే ప్రయతనం చేసినా లెక్క చేయలేదు. పైగా తన నిర్ణయాన్ని వ్యతిరేకించే దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు. అయితే ఇప్పుడు ట్రంప్‌ సడన్‌గా వెనక్కి తగ్గారు. సైనిక దాడి ప్లాన్‌ను ఉపసంహరించి, చర్చలు చేయాలని ప్రకటించారు. ఈ మలుపు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

యూటర్న్‌కు ఐదు కారణాలు..
ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ విషయంలో వెనక్కు తగ్గడానికి విశ్లేషకులు ప్రధానంగా ఐదు కారణాలు చూపుతున్నారు. మొదటిది అమెరికా ఖ్యాతి దెబ్బతినడం, రెండోది ప్రపంచవ్యాప్త వ్యతిరేకత, మూడోది నాటో, యూఎన్‌ నిబంధనల ఉల్లంఘన ప్రభావం, నాలుగోది మిత్రరాజ్యాలతో సంబంధాలు దెబ్బతినడం, ఐదోది స్వదేంలో మద్దతు లేకపోవం.

అంతర్జాతీయ ఖ్యాతి హాని..
సైనిక చర్యలు అమెరికాను ‘బలవంతకర్త’గా చూపిస్తాయనే భయం ట్రంప్‌ను ఆపింది. గ్రీన్‌లాండ్‌ ఆక్రమణ ప్రపంచంలో అమెరికా లోక్మినేటర్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. ఇది దీర్ఘకాల రాజకీయ లాభాలకు ఆటంకం కావచ్చు. ఇప్పటికే వెనెజువెలా విషయంలో అభాసుపాలైంది.

ప్రపంచవ్యాప్త వ్యతిరేకత..
ఐరోపా, ఆసియా దేశాలు గ్రీన్‌లాండ్‌ ప్లాన్‌పై ఏకమై ఖండించాయి. డెన్మార్క్, ఐస్‌లాండ్‌లతో పాటు యూఎన్‌ సభ్య దేశాలు సంయుక్త ప్రకటనలు జారీ చేశాయి. ఇటువంటి ఒత్తిడి ట్రంప్‌ వ్యూహాన్ని మార్చడానికి దారితీసింది.

నాటో, యూఎన్‌ నియమాల ప్రభావం…
సైనిక దాడి నాటో, యూఎన్‌ చట్రాలను భంగపరుస్తుంది. ఇది అమెరికాకు ఆర్థిక ఆంక్షలు, కూటమి విడిపోకలకు దారితీయవచ్చు. ట్రంప్‌ ఈ చట్రపరమైన పరిణామాలను జోలక్‌లు చూడలేకపోయారు.

ప్రమాదంలో బిత్రబంధం…
గ్రీన్‌లాండ్‌ ప్లాన్‌ అమెరికా మిత్రదేశాలతో దూరం పెంచుతుంది. కెనడా, ఐరోపియన్‌ యూనియన్‌లో టెన్షన్‌లు తలెత్తుతాయి. ఈ రాజకీయ గ్యాప్‌ అమెరికా ప్రభావాన్ని బలహీనపరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దేశీయ మద్దతు లోపం
అమెరికాలో ట్రంప్‌ ప్లాన్‌కు పూర్తి మద్దతు లేదు. కాంగ్రెస్, పబ్లిక్‌ ఒపీనియన్‌ వ్యతిరేకంగా మారాయి. ఆర్థిక, రాజకీయ ఒత్తిడులు దాడి ఆలోచనలను వదిలేసేలా చేశాయి.

ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ మలుపు అంతర్జాతీయ ఒత్తిడి, దేశీయ రాజకీయాల సమతుల్యత. ఇది అతని ’అమెరికా ఫస్ట్‌’ విధానానికి సరిపోతూ, దీర్ఘకాల లాభాలను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్‌ చర్చలకు మార్గం సుగమం చేస్తూ, అమెరికా శక్తిని కాపాడుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular