Yaganti Temple : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి క్షేత్రం గురించి ఇటీవల ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. శ్రావణమాసం సందర్భంగా ఈ క్షేత్రానికి భక్తుల రద్దీ తీవ్రమవుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఇక్కడికి రావడానికి సుదూర ప్రాంతాల నుంచి ఆసక్తి చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నంది విగ్రహం. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలిస్తే తప్పకుండా సందర్శిస్తారు. ఆ వివరాలు లోకి వెళ్తే..
ప్రతి శివాలయంలో ముందుగా దర్శించుకునేది నందీశ్వరుడుని. అయితే చాలా శివాలయాల్లో నంది విగ్రహం సాధారణంగా ఉంటుంది. కానీ యాగంటి క్షేత్రంలో మాత్రం చాలా ఎత్తుతో ఉంటుంది. ఈ విగ్రహం 15 అడుగుల ఎత్తు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహం ఒక అంగుళం చొప్పున పెరుగుతుందని చెబుతున్నారు. అలా పెరగడానికి రెండు రకాల కారణాలు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక ప్రకారం.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంతో ఈ విగ్రహానికి సంబంధం ఉందా అని చెబుతున్నారు. శివుడికి వాహనంగా ఉన్న ఈ నందీశ్వరుడు కలియుగాంతంలో రంకె వేస్తాడని చెబుతారు. కానీ మరోవైపు సైంటిస్టులు తెలుపుతున్న ప్రకారం ఈ విగ్రహం రాయి ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రాయిని స్పాంజ్ లైన్ స్టోన్ అని అంటారు. ఇందులో సిలికా, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. గాలిలో తేమ, లేదా వర్షపు నీరు ఈ రాయికి తగిలినప్పుడు సహజంగా దీని పరిమాణం పెరుగుతుందని అంటున్నారు.
కానీ ఇక్కడి నందీశ్వరుడని చూడడానికి చాలామంది ఆసక్తిగా వస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ నందీశ్వరుడు పెద్ద ఆకారంలో ఉండడంతో శివుడి మహిమా అని కొందరు నమ్ముతున్నారు. వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు వెళ్లి అక్కడి నుంచి వివిధ ప్రయాణ సాధనాల ద్వారా చేరుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఆలయం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ కోనేరులోకి నీరు ఎలా వస్తుందో తెలియకుండా ఉంటుంది. భాగంగా వచ్చే నీటి వరాలతో సంబంధం ఉందని చెబుతున్నారు.
అంతేకాకుండా ఇక్కడ ఎటు చూసినా కాకులు కనిపించవు. ఒకప్పుడు అగస్త్య మహర్షి తపస్సుకు కాకులు ఆటంకం కలిగించడంతో ఆయన శాపం ఇచ్చారని.. అప్పటినుంచి ఇక్కడ కాకులు కనిపించవని అంటుంటారు.