spot_img
Homeక్రీడలుOdi World Cup 2023: పాకిస్తాన్‌ క్రికెటర్‌పై కేసు.. మన లాయర్‌ ఎందుకు వేశాడో తెలుసా?

Odi World Cup 2023: పాకిస్తాన్‌ క్రికెటర్‌పై కేసు.. మన లాయర్‌ ఎందుకు వేశాడో తెలుసా?

Odi World Cup 2023: హైదరాబాద్‌ లో అక్టోబర్‌ 6న నెదర్లాండ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఒక విషయంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కీపర్, బాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మీద భారత న్యాయవాది వినీత్‌ జిందాల్‌ ఐసీసీలో ఫిర్యాదు చేశారు. మరి ఆ మ్యాచ్‌లో రిజ్వాన్‌ చేసిన పొరపాటు ఏంటి.. న్యాయవాదు చేసిన ఫిర్యాదు ఏంటో తెలుసుకుందాం.

మైదానంలో ప్రార్థన..
అక్టోబర్‌ 6న నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో రిజ్వాన్‌ మైదానంలోనే నమాజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే అందరూ తన మతాచారం ప్రకారం అలా చేసి ఉంటాడని భావించారు. కానీ న్యాయవాది వినీత్‌ జిందాల్‌ మాత్రం దీనిపై అభ్యంతరం తెలిపారు. అంత మంది భారతీయుల ముందు ఇలా ప్రార్థన చేయడం అనేది తన కులాన్ని చూపించడం అవుతుందని, క్రీడ అనే ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటి పని చేయడం అనేది క్రీడా స్ఫూర్తికి ప్రభావం చేసే పని అని వినీత్‌ పేర్కొన్నారు.

మతపరమైన అంశాలు..
తన ఫిర్యాదులో వినీత్‌ ఈ విషయంపై మాట్లాడుతూ, ‘మైదానంలో ప్రార్థన చేయడం, శ్రీలంకపై తన ప్రదర్శనని గాజాకి అంకితం చేయడం ఇవన్నీ కూడా మతపరమైన విషయాలు’ అని అన్నారు. తన ఫిర్యాదును వినీత్‌ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేశారు. ఇందులో ఈ విషయం మీద వివరంగా రాశారు. ‘క్రీడకు సంబంధం కాని విషయం ఏదైనా కూడా, క్రీడా స్ఫూర్తిని పెంపొందించదు అని, అలాంటివి చేయకూడదు అని, మైదానంలో ఉన్నప్పుడు క్రీడకి మాత్రమే పరిమితం అయ్యి ఉండాలి’ అని అర్థం వచ్చేలాగా రాశారు. అంతే కాకుండా 2021లో కూడా రిజ్వాన్‌ మైదానంలో నమాజ్‌ చేశారు అని ఇందులో పేర్కొన్నారు.

క్రీడలు కుల మతాలకు అతీతం.
క్రీడలు అనేది అంతర్జాతీయంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇలా చేయడం వల్ల ఒక దేశానికి మరొక దేశానికి మధ్య కులం, మతం, జాతి అనే వాటితో సంబంధం లేకుండా ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. కానీ పాకిస్తాన్‌ క్రికెటర్‌ రిజ్వాన్‌ మతాన్ని చూపడానికి ప్రార్థన చేశారు అని వినీత్‌ తెలిపారు. రిజ్వాన్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని ఐసీసీని కోరారు. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper