T20 World Cup 2026: నీకు తిక్క రేగాలేమో.. నాకు 24 అవర్స్ ఆన్ లోనే ఉంటుంది.. బాలయ్య బాబు డైలాగ్ గుర్తుంది కదా.. ఈ డైలాగులు టీం ఇండియా అభిమానులు పాకిస్తాన్ జట్టుకు నిత్యం గుర్తు చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా మెంటల్ ర్యాగింగ్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలుసు. టీమిండియా మీద ఏ స్థాయిలో తన అక్కసు బయటపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీ లో ఆడబోమని.. భారత్ తో జరిగే మ్యాచ్ రద్దు చేసుకుంటామని.. బంగ్లాదేశ్ జట్టుకు తటస్థ వేదికల్లో ఆడే అవకాశం కల్పించాలని… ఇలా రకరకాల డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. పాకిస్తాన్ తన మీడియాలో భారత్ మీద అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేయించింది.
పాకిస్తాన్ చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది.. చివరికి ఐసీసీ చెప్పినట్టుగా వినాల్సి వచ్చింది. అంతేకాదు భారత జట్టుతో మ్యాచ్ కూడా ఆడాల్సి వస్తోంది.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న టీమిండియా అభిమానులు పాకిస్తాన్ జట్టుకు సోషల్ మీడియాలో చూక్కలు చూపిస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో తమ స్టామినా ఏమిటో నిరూపించుకుంటున్నారు.. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా జార విడుచుకోకుండా టీం ఇండియా అభిమానులు అంటే ఎలా ఉంటారో పాకిస్తాన్ జట్టుకు.. పాకిస్తాన్ దేశానికి రుచి చూపిస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. క్రికెట్ అభిమానులకు అద్భుతమైన ఆనందాన్ని అందించింది. వెస్టిండీస్ జట్టు, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు టీమిండియా అభిమానులు భారీగా హాజరయ్యారు. మ్యాచ్ జరిగిన మైదానంలో దాదాపు 21,577 అభిమానులు హాజరయ్యారు. దీనిని బట్టి టీమిండియా ఫ్యాన్స్ ఎలా ఉంటారో పాకిస్తాన్ జట్టుకు అర్థమైంది. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియాలో నిర్వహిస్తే ఫ్లాప్ అవుతుందని పాకిస్తాన్ జట్టు పిల్లి శాపనార్థాలు పెట్టింది. కానీ, టీమిండియా అభిమానుల సత్తా ముందు పాకిస్తాన్ తలవంచింది. టీమిండియా అభిమానులు ప్రతి మ్యాచ్ కు భారీగా హాజరవుతున్నారు. తద్వారా టోర్నీని అత్యంత అద్భుతంగా విజయవంతం చేస్తున్నారు.