Homeక్రీడలుక్రికెట్‌England vs Sri Lanka Women: ఇండియాను ఓడించారు.. లంకను పడుకోబెట్టారు.... ఇంగ్లండ్ అమ్మాయిలు ఈసారి...

England vs Sri Lanka Women: ఇండియాను ఓడించారు.. లంకను పడుకోబెట్టారు…. ఇంగ్లండ్ అమ్మాయిలు ఈసారి కప్ కొట్టేలా ఉన్నారే..

England vs Sri Lanka Women: మహిళల t20 ప్రపంచ కప్ 2009లో ప్రారంభమైంది. ప్రారంభ సీజన్లో ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీ అందుకుంది. బలమైన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా జట్లు పోటీలో ఉన్నప్పటికీ.. వాటన్నింటిని అధిగమించి ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలి సీజన్లో విజేతగా నిలిచి అదరగొట్టింది. 2009 తర్వాత ఇంతవరకు ఇంగ్లాండ్ మరోసారి t20 ప్రపంచ కప్ అందుకోలేదు. కొన్ని సందర్భాలలో గెలుచుకునే అవకాశం వచ్చినప్పటికీ చివరి అంచెలో ఓడిపోయింది. అయితే ఈసారి ఇంగ్లాండ్ గడ్డమీద […]

England vs Sri Lanka Women: మహిళల t20 ప్రపంచ కప్ 2009లో ప్రారంభమైంది. ప్రారంభ సీజన్లో ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీ అందుకుంది. బలమైన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా జట్లు పోటీలో ఉన్నప్పటికీ.. వాటన్నింటిని అధిగమించి ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలి సీజన్లో విజేతగా నిలిచి అదరగొట్టింది.

2009 తర్వాత ఇంతవరకు ఇంగ్లాండ్ మరోసారి t20 ప్రపంచ కప్ అందుకోలేదు. కొన్ని సందర్భాలలో గెలుచుకునే అవకాశం వచ్చినప్పటికీ చివరి అంచెలో ఓడిపోయింది. అయితే ఈసారి ఇంగ్లాండ్ గడ్డమీద టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మహిళల జట్టు ఈసారి ఎలాగైనా సరే విజేతగాని నిలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే t20 వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టు మీద అద్భుతమైన గెలుపును అందుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ డైని వైట్ హాడ్జ్ 105* పరుగులు చేసింది. కేవలం 62 బంతుల్లోనే ఆమె ఈ స్థాయిలో పరుగులు చేయడం విశేషం. ఆమె జోన్స్ 28 బంతుల్లో 53, బ్రాంట్ 22 బంతుల్లో 46 పరుగులు చేసింది.

అనంతరం ఈ టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో రంగంలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. నీలాక్షిక 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెంపు నాలుగు వికెట్లు, డీన్ రెండు వికెట్లు, సోఫీ రెండు వికెట్లు తీసుకున్నారు. దాదాపు 87 పరుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇటీవల భారత మహిళలతో జరిగిన టి20 సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత మహిళల జట్టుకు చుక్కలు చూపించింది. ఏ దశలో కూడా భారత మహిళలు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు టి20 వరల్డ్ కప్ కంటే ముందు ఇండియాలో జరిగిన సిరీస్లో ట్రోఫీని అందుకుంది. అదే ఉత్సాహాన్ని t20 వరల్డ్ కప్ లో కూడా ప్రదర్శిస్తోంది ఇంగ్లాండ్ జట్టు.

భారత మహిళల జట్టును ఓడించి ట్రోఫీని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు.. టి20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లోనే దుమ్మురేపింది. మొత్తంగా ఈసారి సొంత గడ్డమీద జరుగుతున్న టి20 వరల్డ్ కప్లోఫియా అందుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది. అందువల్లే ప్రారంభ మ్యాచ్ లోనే 219 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థి జట్లకు ఇంగ్లాండ్ మహిళలు గట్టి హెచ్చరికలు పంపించారు. తదుపరి మ్యాచ్లలో ఇంగ్లాండ్ మహిళలు ఏ స్థాయిలో అదరగొడతారో.. ఏ రేంజ్ లో పరుగులు చేస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper