Jasprit Bumrah : మైదానంతో సంబంధం లేదు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లతో సంబంధం లేదు. ఎలాగైనా సరే బౌలింగ్ వేస్తాడు. అద్భుతమైన బంతులను సంధిస్తాడు. వికెట్ల వేటను కొనసాగిస్తాడు. ఒకవేళ వికెట్లు తీయడం సాధ్యం కాకపోతే.. పరుగులను నియంత్రిస్తాడు.. ప్రస్తుత టీ 20 వరల్డ్ కప్ లో కూడా అదే చేశాడు. తద్వారా టీమిండియా గెలుపులలో తనవంతు పాత్ర పోషించాడు..
ఈ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన అంత గొప్పగా లేదు. బుమ్రా మాత్రమే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇదే క్రమంలో టి20 వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. బుమ్రా బంతి అందుకోవడమే ఆలస్యం వికెట్ పడగొట్టాడు. ఇలా టీ 20 వరల్డ్ కప్ లో బుమ్రా ఐదుసార్లు ఆ ఘనతను అందుకున్నాడు.. ఇందులో మూడుసార్లు నాకౌట్ మ్యాచ్ లలో ఆ రికార్డును సృష్టించాడు. 2016లో సెమి ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు గేల్ ను బుమ్రా తను వేసిన ఓవర్ తొలి బంతికి అవుట్ చేశాడు. 2026 t20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ ను ఔట్ చేశాడు. 2026 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను తొలి బంతికే అవుట్ చేశాడు. ఇక 2016 లో మార్లోన్ శామ్యూల్స్, 2026 లో న్యూజిలాండ్ ఆటగాడు సి ఫర్ట్ ను ఔట్ చేశాడు బుమ్రా.
ప్రస్తుత టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా బౌలర్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. బుమ్రా మాత్రమే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అతడు టీమ్ ఇండియాకు వజ్రాయుధం లాగా మారిపోయాడు. కెప్టెన్ సూచించినప్పుడు బంతిని అందుకుని వికెట్లు తీశాడు. వికెట్లు తీయడం సాధ్యం కాని పక్షంలో పరుగులను నియంత్రించాడు. తద్వారా ఈ టి20 వరల్డ్ కప్ లో అత్యంత తక్కువ ఎకానమీ నమోదు చేసిన మూడో బౌలర్ గా నిలిచాడు బుమ్రా. అంతేకాదు ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అహ్మదాబాద్ మైదానంలో నల్లరేగడి మట్టితో రూపొందించిన పిచ్ పై విన్యాసం చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు చుక్కలు చూపించాడు.
సాధారణంగా ఒక బౌలర్ కొన్ని సందర్భాలలో బంతిమీద నియంత్రణ కోల్పోతాడు. కానీ బుమ్రా అలా కాదు. బంతిపై ఏ దశలో కూడా నియంత్రణ కోల్పోలేదు. నిప్పు రవ్వల మాదిరిగా బంతులను వేశాడు. పరుగులు తీయడం కాదు కదా.. కనీసం క్రీజ్ లో నిలబడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో న్యూజిలాండ్ ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. “అతడు టీమిండియా వజ్రాయుధం. అంతటి గొప్ప బౌలర్ ఇలానే బంతులు వేస్తాడని” రవి శాస్త్రి లాంటి వ్యక్తులు పదేపదే వ్యాఖ్యానించడం బుమ్రా బౌలింగ్ గొప్పతనాన్ని సూచిస్తుంది.