spot_img
Homeవింతలు-విశేషాలుDiamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి. అందువల్లే వాటిని కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతున్నారు. అందువల్లే ఆ లోహాలు ఉన్న ప్రాంతాలు ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందాయి. గల్ఫ్ దేశాలలో బంగారం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కూడా బంగారం దొరుకుతుంది. కాకపోతే గల్ఫ్ దేశాలలో కనిపించిన అభివృద్ధి.. ఆఫ్రికాలో ఉండదు. దానికి కారణం అక్కడి ముఠాలు.

బంగారం మాత్రమే కాకుండా.. రేర్ ఎర్త్ మినరల్స్.. వజ్రాలు వంటివి కూడా భూమిలో లభిస్తుంటాయి. అయితే వీటిని తవి తీసినప్పుడు మిల మిల మంటూ మెరిసిపోవు. వీటిని శుద్ధి చేయాలి. ఆ తర్వాత రకరకాల మార్పులకు గురిచేయాలి. అప్పుడే అవి ధరించడానికి అనుకూలంగా ఉంటాయి. ఖరీదైన లోహాలు మొత్తం భూగర్భంలో మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఆకాశం నుంచి వజ్రాలు వర్షం అలాగా కురిస్తే ఎలా ఉంటుంది.. ఆ వజ్రాలను మీరు ఏరుకోవడానికి సిద్ధంగా ఉన్నారా.. అడ్రస్ చెప్పండి వెళ్లిపోతాం అంటారా.. అయితే చదివేయండి ఈ కథనం..

ఈ భూమి మీద వర్షం కురిస్తే మనం ఏం చేస్తాం.. గొడుగు అడ్డుపెట్టుకుంటాం. కానీ అంతరిక్షంలో యురేనస్.. నెప్ట్యూన్ వంటి గ్రహాల మీద వర్షం కురిస్తే.. ఏ గొడుగు అడ్డుపెట్టుకున్నా సరే పెద్దగా ఉపయోగ ఉండదు. ఎందుకంటే అక్కడ వర్షం కురవదు. పైగా అవినీటి చుక్కలు కూడా కావు. సాక్షాత్తు డైమండ్స్. అయితే యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలు భూమి లాగా రాళ్లతో ఉండవు. అక్కడ మొత్తం మీదే మీథేన్, అమూల్య, నీరు వంటివి వాయువుల రూపంలో ఉంటాయి. పైగా అక్కడి వాతావరణం కూడా అత్యంత దారుణంగా ఉంటుంది. లోపలికి వెళ్తున్నప్పుడు ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఆ పీడనం తాకిడికి మీథేన్ లో ఉన్న కార్బన్ అణువులు విడిపోతాయి. చిన్న చిన్న వజ్రాలు మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ ఉండే మేఘాలు కూడా కార్బన్ ను చిదిమేస్తాయి. తద్వారా వజ్రపు గింజలను తయారుచేస్తాయి. వాటిని కిందికి కురిసేలా చేస్తాయి. భూమి మీద వడగండ్ల వర్షం ఎలా అయితే కురుస్తుందో.. అక్కడ వజ్రాల వర్షం పడుతూ ఉంటుంది.. అయితే వాటిని మనం సేకరించే అవకాశం ఉండదు. అక్కడ గాలి వేగం విపరీతంగా ఉంటుంది. ఆ ఒత్తిడిని ఎటువంటి అంతరిక్ష నౌక కూడా భరించలేదు. కనీసం తట్టుకోలేదు.

అక్కడి వాతావరణం తట్టుకొని వజ్రాలు సేకరించడానికి గతంలో ప్రయోగాలు జరిగినట్టు.. ప్రయత్నాలు చేసినట్టు ఆధారాలు లేవు. ఎందుకంటే ఒక్కొక్కసారి భూమి నుంచి పైకి ఒక నిర్ణీత అంతరిక్షం వరకే వెళ్లగలిగే సామర్థ్యం మాత్రమే అంతరిక్ష నౌకలకు కలిగి ఉంది. అక్కడ పీడనాన్ని తట్టుకునే స్థాయిలోనే వాటిని రూపొందిస్తారు. అంతేతప్ప మిగతా యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల మీదకు అంతరిక్ష నౌకలు వెళ్లలేవు. అక్కడి పీడనాన్ని అసలు తట్టుకోలేవు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper