Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer: సర్పంచ్ సాబ్ కాదు.. టీమిండియా పాలిట దరిద్రం.. సూర్యకు కెప్టెన్సీ అప్పగించాల్సిందేనా..

Shreyas Iyer: సర్పంచ్ సాబ్ కాదు.. టీమిండియా పాలిట దరిద్రం.. సూర్యకు కెప్టెన్సీ అప్పగించాల్సిందేనా..

Shreyas Iyer: ఐపీఎల్ సాగుతున్నప్పుడు.. ముఖ్యంగా పంజాబ్ జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ గురించి విపరీతమైన చర్చ నడిచేది. సర్పంచ్ సాబ్ కు జట్టులో అవకాశాలు కల్పించాలని.. సారధ్య బాధ్యతలు అప్పగించాలని ప్రచారం జరిగింది. దీనికి తోడు కొన్ని మీడియా సంస్థలు అయ్యర్ ను జాకీలు పెట్టి లేపాయి. అదే సమయంలో సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన కూడా సరిగా లేకపోవడంతో మేనేజ్మెంట్ ఆలోచనలో పడింది. అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. […]

Shreyas Iyer: ఐపీఎల్ సాగుతున్నప్పుడు.. ముఖ్యంగా పంజాబ్ జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ గురించి విపరీతమైన చర్చ నడిచేది. సర్పంచ్ సాబ్ కు జట్టులో అవకాశాలు కల్పించాలని.. సారధ్య బాధ్యతలు అప్పగించాలని ప్రచారం జరిగింది. దీనికి తోడు కొన్ని మీడియా సంస్థలు అయ్యర్ ను జాకీలు పెట్టి లేపాయి. అదే సమయంలో సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన కూడా సరిగా లేకపోవడంతో మేనేజ్మెంట్ ఆలోచనలో పడింది. అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది.

అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టి20 విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఇప్పటికి టీమిండియా అతడి నాయకత్వంలో మూడు మ్యాచ్లు ఆడింది. ఈ మూడిట్లో కూడా ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. ఒక సిరీస్ అది కూడా ఐర్లాండ్ వంటి అనామక జట్టు చేతిలో టీమ్ ఇండియా కోల్పోయింది. ఇంతకంటే దారుణం మరొకటి ఏముంటుంది. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఏముంటుంది. టీమిండియా స్థాయికి ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం సగటు అభిమానికి ఏమాత్రం జీర్ణం కావడం లేదు.

అయ్యర్ అట్టర్ ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో.. సూర్యకుమార్ యాదవ్ గురించి చర్చ మొదలైంది. సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన గొప్పగా లేకపోయినప్పటికీ జట్టును మాత్రం అతడు అద్భుతంగా నడిపించేవాడని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. 2024 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ పగ్గాలు అందుకున్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. అంతటి దక్షిణాఫ్రికా గడ్డమీద.. ఆస్ట్రేలియా గడ్డమీద టీమిండియా సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. చివరికి 2026 లో జరిగిన టి20 వరల్డ్ కప్ కూడా టీమ్ ఇండియా సాధించింది. అయితే మేనేజ్మెంట్ అతని వ్యక్తిగత ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని కెప్టెన్సీ నుంచి పక్కకు పెట్టింది.

సూర్య నాయకత్వంలో టీమిండియా ఎన్నడు కూడా ఇటువంటి దారుణ ప్రదర్శన చేయలేదు. విదేశీ గడ్డల మీద కూడా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. సూర్యకుమార్ నాయకత్వంలో టీమిండియా 52 మ్యాచ్లు ఆడితే.. కేవలం 8 మ్యాచులలో మాత్రమే ఓడిపోయింది. రెండు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడితే.. మూడు ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. అయ్యర్ నాయకత్వం పట్ల అభిమానులు ఏమాత్రం సంతృప్తి కాలేదు. ఇటువంటి శని గాడిని టీమిండియా మీద ఎందుకు రుద్దుతున్నారని.. గౌతమ్ గంభీర్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయ్యర్ సర్పంచ్ సాబ్ కాదని.. సూర్య కుమార్ యాదవ్ ను తిరిగి జట్టులోకి తీసుకొని.. కెప్టెన్సీ అప్పగించాలని అభిమానులు కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper