Sanju Samson becomes DSP: టీమిండియాలో ఆడిన క్రికెటర్లలో చాలామంది పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో కొంతమంది డిసిపి, ఏసిపి ర్యాంకులలో కొనసాగుతున్నారు. అందులో మన హైదరాబాద్ సిరాజ్ మియా కూడా ఉన్నాడు.. రేవంత్ ప్రభుత్వం అతడిని డిఎస్పీగా గత ఏడాది ప్రమోట్ చేసింది.
ఇప్పుడు ఈ జాబితాలోకి కేరళ ఆటగాడు.. సంజు శాంసన్ కూడా చేరిపోయాడు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంజుకు డి.ఎస్.పి జాబ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో సంజు అదరగొట్టాడు. మూడు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి టీమ్ ఇండియాను గెలిపించాడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇలా మూడు బలమైన జట్ల మీద తన బ్యాటింగ్ ప్రభావాన్ని చూపించాడు. వెస్టిండీస్ జట్టుపై ఏకంగా 97* పరుగులు చేశాడు. జట్టుకు అవసరమైన పరుగులు మాత్రమే కాకుండా.. మిగతా ఆటగాళ్లు విఫలమైన చోట అతడు ఒక్కడే శక్తి లాగా నిలబడ్డాడు.
సంజు చిరస్మరణీయ ఆటతీరు కొనసాగించిన నేపథ్యంలో.. టి20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. టీ వరల్డ్ కప్ తర్వాత సంజు శాంసన్ రేంజ్ ఒకసారిగా మారిపోయింది. అతడిని నేషనల్ హీరోగా అభిమానులు భావిస్తున్నారు. ఇక కేరళ క్రికెట్ అభిమానులైతే సంజు ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. “మా రాష్ట్రానికి దొరికిన ఆణిముత్యం.. మా ప్రాంతాన్ని చెందిన వ్యక్తి.. టీమిండియాలో కీలకమైన ఆటగాడిగా మాత్రమే కాకుండా.. గొప్ప ఇన్నింగ్స్ నిర్మించిన శక్తిగా మేము గుర్తిస్తున్నామని” కేరళ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
Also Read: చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇచ్చిన సన్ పిక్చర్స్.. అలా చేయడం ఇక కష్టమేనా?
త్వరలో కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. సంజుకు డి.ఎస్.పి ఉద్యోగాన్ని అక్కడి ప్రభుత్వం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత సంజును కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రత్యేకంగా అభినందించారు. టీమ్ ఇండియా గెలుపులో ముఖ్యపాత్ర పోషించావంటూ భుజం తట్టి అభినందించారు. డి.ఎస్.పి ఉద్యోగాలు సాధించిన టీమ్ ఇండియా క్రికెట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సంజు కూడా చేరిపోయాడు. ఇకపై సంజు కేరళ రాష్ట్రానికి డిఎస్పి సాబ్!
