Homeక్రీడలుక్రికెట్‌Rishabh Pant Tweet: అంతలా ప్రాధేయపడటం ఏంటి.. అర్ధరాత్రి రిషబ్ పంత్ సంచలన ట్వీట్

Rishabh Pant Tweet: అంతలా ప్రాధేయపడటం ఏంటి.. అర్ధరాత్రి రిషబ్ పంత్ సంచలన ట్వీట్

Rishabh Pant Tweet:  స్పోర్ట్స్ వర్గాల్లో ఒకటే చర్చ. ఈ అర్ధరాత్రి పూట ట్వీట్ చేయడం ఏంటి.. అసలు ఏం జరిగింది.. పైగా అందులో ప్రాధేయపడ్డాడు. ఇంతలా బతిమిలాడాల్సిన అవసరమేంటి.. ఇదిగో ఈ చర్చే సాగుతోంది రిషబ్ పంత్ మీద. కొన్ని సంవత్సరాల క్రితం రోడ్ యాక్సిడెంట్ కి గురై.. చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాడు పంత్. ఆ తర్వాత చాలా రోజులపాటు ఆసుపత్రికి మాత్రమే పరిమితమయ్యాడు. కొద్దిరోజులు అయితే అతడు బ్రష్ కూడా […]

Rishabh Pant Tweet:  స్పోర్ట్స్ వర్గాల్లో ఒకటే చర్చ. ఈ అర్ధరాత్రి పూట ట్వీట్ చేయడం ఏంటి.. అసలు ఏం జరిగింది.. పైగా అందులో ప్రాధేయపడ్డాడు. ఇంతలా బతిమిలాడాల్సిన అవసరమేంటి.. ఇదిగో ఈ చర్చే సాగుతోంది రిషబ్ పంత్ మీద.

కొన్ని సంవత్సరాల క్రితం రోడ్ యాక్సిడెంట్ కి గురై.. చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాడు పంత్. ఆ తర్వాత చాలా రోజులపాటు ఆసుపత్రికి మాత్రమే పరిమితమయ్యాడు. కొద్దిరోజులు అయితే అతడు బ్రష్ కూడా చేసుకునే పరిస్థితి లేదు. మరో ఆటగాడు గనుక అతని ప్లేస్ లో ఉంటే కచ్చితంగా బ్యాట్ పట్టుకునే వాడు మాత్రం కాదు. ఎందుకంటే పంత్ కు అయిన రోడ్ యాక్సిడెంట్ అటువంటిది.

రిషబ్ పంత్ కోలుకొని.. ఆ తర్వాత బ్యాట్ పట్టుకున్నాడు. ఐపీఎల్ లో సత్తా చూపించాడు. టెస్ట్ క్రికెట్ లో అదరగొట్టాడు. సుదీర్ఘ ఫార్మేట్ ఆడుతున్నప్పుడు అనేక సందర్భాలలో గాయాల బారిన పడినప్పటికీ వెంటనే కోలుకున్నాడు. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పంత్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా అతడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ని ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు. అది చర్చకు దారి తీస్తోంది. ” హలో సార్ మూడు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను. కానీ భూమి దొరకడం లేదు. ప్రభుత్వం ఇస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు భూమి ఇవ్వలేదు. బహుమతిగా ఇస్తే బాగుంటుంది. లేదా కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వండి” అంటూ పంత్ కోరాడు..

పంత్ దగ్గర భారీగానే డబ్బుంది. పైగా అతనికి ఉచితంగా భూమి తీసుకోవాల్సిన అవసరం లేదు. సొంతంగా ఇల్లు కట్టుకునే సామర్థ్యం అతనికి రెట్టింపు స్థాయిలో ఉంది. ఇలాంటి అప్పుడు కేవలం భూమి కోసం అతడు పాకులాడాల్సిన అవసరం లేదు. అతని అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా.. అందువల్లే ఇలాంటి ట్వీట్ పోస్ట్ చేశాడా.. అని క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది. దీనిపై ఇంతవరకు పంత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ హ్యాక్ అయ్యి గనుక ఉంటే కచ్చితంగా అతడు స్పందించే అవకాశం ఉంది.. అర్ధరాత్రి పూట పంత్ ఇలాంటి ట్వీట్ చేయడం చర్చనీయాశంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper