IND Vs NZ Rishabh Pant: న్యూజిలాండ్ (IND vs NZ) జట్టుతో భారత్ తలపడే మూడు వన్డేల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ వడోదర(Vadodara)లో జరగనుంది. భారత జట్టుకు గిల్(Shubman Gill) నాయకత్వం వహించబోతున్నాడు. 2026 సీజన్ లో టీమిండియా ఆడే ఆడే తొలి సిరీస్ ఇదే.
ఈ సిరీస్ స్ కంటే ముందు టీం ఇండియా స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఎంతో ఉత్సాహంతో కనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. వడోదరలోని కోటాంబి స్టేడియంలో ఇదే పురుషుల క్రికెట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత మహిళల జట్టు రెండుసార్లు ఆడింది. ఆ రెండు సందర్భాలలో పిచ్ పేస్ బౌలింగ్ కు సహకరించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
ఈ మ్యాచ్ లో అయ్యర్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడిన అతడు.. ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు. అతడి రకరకాల వదంతులు వినిపించినప్పటికీ.. చివరికి అతడు ఆడటం ఖాయం అయిపోయింది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు గిల్ దూరమయ్యాడు. ఈ సిరీస్ లో అతడు జుట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. జైస్వాల్ కు తుది జట్టులో చోటు లభించలేదు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియాకు షాక్ తగిలింది. భీకరమైన ఆటగాడు రిషబ్ పంత్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో జురెల్ కు అవకాశం కల్పించినట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇక ఈ సిరీస్ లో ఆల్ రౌండర్లుగా జడేజా, సుందర్ రంగంలోకి దిగుతున్నారు. ప్రధాన స్పిన్నర్ గా కుల దీప్ యాదవ్ కొనసాగబోతున్నాడు. సిరాజ్ పేస్ బౌలర్ గా ఉంటాడు.
మరోవైపు న్యూజిలాండ్ జట్టు లో 8 మంది ఆటగాళ్లు ఇంతవరకు భారత గడ్డమీద ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక మిగతా కారణాలవల్ల శాంట్నర్, హెన్రీ, చాప్మన్, రూర్క్, లాతం, విలియంసన్ జట్టుకు దూరమయ్యారు. బ్రేస్ వేల్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 350 పరుగుల చేదనలో బ్రేస్ వెల్ 78 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు.