spot_img
Homeక్రీడలుక్రికెట్‌Preity Zinta family life and children: ప్రీతి జింటాకు పెళ్లి కాలేదా.. మరి ఆ...

Preity Zinta family life and children: ప్రీతి జింటాకు పెళ్లి కాలేదా.. మరి ఆ పిల్లలు..

Preity Zinta family life and children: ప్రీతి జింటా.. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం తెలుగు తెరను ఆమె ఏలింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది. సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకుంది. దక్షిణాదిలోని ఇతర చిత్ర పరిశ్రమలలో కూడా ఆమె నటించింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది.

ఐపీఎల్ లో పంజాబ్ జట్టు ప్రమోటార్లలో తను కూడా ఒకరు. పంజాబ్ జట్టు ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోవడానికి ప్రధాన కారణం ప్రీతీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మ్యాచ్ ముగియగానే తన జట్టు ప్లేయర్లను ఆమె దగ్గరికి తీసుకొని అభినందిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టు సారధిగా వచ్చిన తర్వాత ప్రీతి జింటా ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. పంజాబ్ జట్టు అతని ఆధ్వర్యంలో వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ప్రీతి.. ఆనంద తాండవం చేస్తోంది.

ఇటీవల అయ్యర్ గురించి ప్రీతి కీలక వ్యాఖ్యలు చేసింది. అతడు తమ కుటుంబ సభ్యుడని వ్యాఖ్యానించింది. తన పిల్లలు అతడిని అన్నయ్య అని పిలుస్తారని పేర్కొంది. ప్రీతి వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు. తనకు 41 సంవత్సరాల వయసులో 2016లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త గూడె నాఫ్ ను పెళ్లి చేసుకుంది. సరోగసి విధానం ద్వారా 2021లో కవలలు జై (కుమారుడు), జియా (కుమార్తె) జన్మించారు. ప్రీతి రాజ్ పుత్ కుటుంబానికి చెందిన మహిళ. ఈమె తండ్రి ఆర్మీలో పని చేశారు. పంజాబ్ జట్టులో ఈమెకు 3450 కోట్ల రూపాయల వాటా ఉంది. తన భర్తతో కలిసి ప్రీతి అమెరికాలో ఉంటున్నది. అయినప్పటికీ ఆమె అక్కడి పౌరసత్వాన్ని తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రీతి చురుకుగా ఉంటుంది. తన జట్టుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.

ఇటీవల సర్పంచ్ సాబ్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అతడు పోరాట యోధుడని కొనియాడింది. అతడి నాయకత్వంలో పంజాబ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని పేర్కొంది. అతడు నాయకత్వంలో పంజాబ్ జట్టు ఇంకా అభివృద్ధి చెందాలని ఆశించింది.. సినిమాలకు చాలా సంవత్సరాల క్రితమే గుడ్ బై చెప్పినప్పటికీ.. ఐపీఎల్ ద్వారా ప్రీతి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అందువల్లే ఆమెకు ఈ స్థాయిలో అభిమానుల అండదండలు లభిస్తున్నాయి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper