Homeఅంతర్జాతీయంUkraine missing people crisis: ఉక్రెయిన్ లో మనుషులు మాయం.. అన్ని వేళ్లూ రష్యా వైపే.....

Ukraine missing people crisis: ఉక్రెయిన్ లో మనుషులు మాయం.. అన్ని వేళ్లూ రష్యా వైపే.. ఇంతకీ ఏం జరుగుతోంది..

Ukraine missing people crisis: యుద్ధం వల్ల వచ్చే ప్రగతి ఉండదు. యుద్ధంతో కేవలం వినాశనం మాత్రమే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు రెండు యుద్ధాలు భీకరంగా సాగాయి. అన్ని సందర్భాలలో కూడా నష్టం విపరీతంగా జరిగింది.. ఆస్తిపరంగా, మనుషుల ప్రాణాలపరంగా పూడ్చలేని నష్టం చోటుచేసుకుంది. ప్రపంచ యుద్ధంలో భాగంగా అమెరికా జపాన్ మీద బాంబు వేసినప్పుడు.. విపరీతమైన నష్టం చోటుచేసుకుంది. ఇప్పటికీ అక్కడ పచ్చ గడ్డి కూడా మొలవడం లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం […]

Ukraine missing people crisis: యుద్ధం వల్ల వచ్చే ప్రగతి ఉండదు. యుద్ధంతో కేవలం వినాశనం మాత్రమే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు రెండు యుద్ధాలు భీకరంగా సాగాయి. అన్ని సందర్భాలలో కూడా నష్టం విపరీతంగా జరిగింది.. ఆస్తిపరంగా, మనుషుల ప్రాణాలపరంగా పూడ్చలేని నష్టం చోటుచేసుకుంది. ప్రపంచ యుద్ధంలో భాగంగా అమెరికా జపాన్ మీద బాంబు వేసినప్పుడు.. విపరీతమైన నష్టం చోటుచేసుకుంది. ఇప్పటికీ అక్కడ పచ్చ గడ్డి కూడా మొలవడం లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆధునిక కాలంలోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. అత్యంత శక్తివంతమైన మిస్సయిల్స్.. ఇతర మందు గుండు సామగ్రితో యుద్ధాలు సాగిస్తున్నారు. ఈ యుద్ధాలలో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో ఆస్తి నష్టం కూడా విపరీతంగా ఉంటున్నది. అందువల్లే యుద్ధాలు ఆపాలని.. ప్రపంచ శాంతిని వర్ధిల్లేలా చేయాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. అయినప్పటికీ యుద్ధ పిపాస ఉన్న అధ్యక్షులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా యుద్ధాలకు మరింత దారుణంగా పిలుపునిస్తున్నారు. అటువంటి అధ్యక్షుల వల్ల ప్రపంచంలో ఏదో ఒకచోట యుద్ధాలు సాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల అధ్యక్షుల పిలుపుల వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి.

యుద్ధాలకు పిలుపునిచ్చే దేశ అధ్యక్షులు బాగానే ఉంటున్నారు. కానీ ముందు వరసలో పనిచేసే సైనికులే నరకం చూస్తున్నారు. చివరికి వారే సమిధలుగా మారిపోతున్నారు. యుద్దాల వల్ల సైనికుల పరిస్థితి దారుణంగా ఉంటుందో ప్రపంచానికి ఇప్పటికే అనేక సందర్భాలలో అర్థమైంది. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొంతకాలంగా యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ దేశంలో పోరాడుతున్న రష్యా సైనికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి తట్టుకోలేక నర మాంస భక్షణకు కూడా దిగినట్టు తెలుస్తోంది. దీ సండే టైమ్స్ అనే పత్రిక ఈ కథనాన్ని వెల్లడించింది. దాదాపు 5 సందర్భాలలో రష్యా సైనికులు తమ తోటి వారి మాంసాన్ని తిన్నారని ఉక్రెయిన్ నిగా వర్గాల సమాచారంతో తెలిసింది. 2025లో నవంబర్ నెలలో డోనెట్స్ ప్రాంతంలో ఒక సైనికుడు మరో ఇద్దరు సైనికులను చంపాడు. ఆ సైనికులను అతడు తినడానికి ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ దళాలు చంపేశాయి.. ఈ కథనాన్ని ది సండే టైమ్స్ వెల్లడించింది. దీంతో యుద్ధం వల్ల జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో.. అవి ఎంతటి దారుణానికి దారి తీస్తాయో ప్రపంచానికి తెలిసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper