spot_img
HomeతెలంగాణBhatti Vikramarka camp tragedy: వరుసగా మూడు మరణాలు.. డిప్యూటీ సీఎం శిబిరంలో అంతులేని విషాదం..

Bhatti Vikramarka camp tragedy: వరుసగా మూడు మరణాలు.. డిప్యూటీ సీఎం శిబిరంలో అంతులేని విషాదం..

Bhatti Vikramarka camp tragedy: తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు.. ఈయన మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విక్రమార్క ముఖ్యపాత్ర పోషించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

ప్రస్తుతం విక్రమార్క తెలంగాణలో ఉపముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. ఆర్థిక, సింగరేణి వంటి శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శిబిరంలో ఇటీవల చోటుచేసుకుంటున్న విషాద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. గడచిన 14 కాలంలో విక్రమార్క శిబిరంలో కీలకంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కన్నుమూశారు. దీంతో బాధిత కుటుంబాలలో తీవ్రమైన దుఃఖం నెలకొంది. ఈ పరిణామాలతో విక్రమార్క కూడా ఆందోళనలో ఉన్నారు.

తక్కెళ్ళపల్లి శ్రీనివాస్

విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 24న గుండెపోటుతో చనిపోయారు. ఖమ్మం శివారు ప్రాంతంలోని ఏదులాపురం పురపాలకం పరిధిలో ఉన్న తన నివాసంలో శ్రీనివాస్ గుండెపోటుకు గురై చనిపోయారు. శ్రీనివాస్ చనిపోవడాన్ని విక్రమార్క జీర్ణించుకోలేకపోయారు. శ్రీనివాస్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మహమ్మద్ జావిద్

ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ కన్నుమూశారు. విక్రమార్కకు జావిద్ అత్యంత సన్నిహితమైన వ్యక్తి. విక్రమార్క అత్యంత దగ్గరగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులలో జావిద్ ముందు వరుసలో ఉంటాడు. జావీద్ చనిపోవడం విక్రమార్కకు మాత్రమే కాకుండా.. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు.. ఇటీవల నిర్వహించిన సంతాప సభలో విక్రమార్క జావిద్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

మారబోయిన మధుసూదన్

శ్రీనివాస్, జావిద్ మరణాలను మర్చిపోకముందే.. విక్రమార్క శిబిరంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. సిపిఆర్ఓ మారబోయిన మధుసూదన్ గుండెపోటుకు గురై చనిపోయారు. విక్రమార్కకు, మధుసూదన్ కు అందమైన సంబంధం ఉంది. గతంలో మధుసూదన్ వివిధ పత్రికలలో పనిచేస్తున్నప్పుడు విక్రమార్కకు అనుబంధం ఏర్పడింది. అది కాస్త విక్రమార్కకు సిపిఆర్వోగా ఉండే స్థాయికి ఎగిరింది. విక్రమార్కకు, మధుకు దశాబ్దల అనుబంధం ఉంది. మధుసూదన్ గుండెపోటుతో చనిపోవడం విక్రమార్కకు తీరని లోటు.

శ్రీనివాస్, జావిద్, ఇప్పుడు మధుసూదన్ చనిపోవడంతో విక్రమార్క దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని ఆయన ప్రకటించారు. కీలకమైన వ్యక్తులు నెలల వ్యవధిలోనే చనిపోవడం పట్ల విక్రమార్క ఆవేదన మామూలుగా లేదు. సంబంధిత వ్యక్తుల సంతాప సభల్లో పాల్గొన్నప్పుడు విక్రమార్క తన ఆవేదనను మాటల రూపంలో చెప్పలేకపోతున్నానని కన్నీటి పర్యంతమవుతున్నారు. విక్రమార్క శిబిరంలో ఇలా వరుసగా విషాదాలు జరగడం అటు ఆయనకు.. కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper