BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని ఇప్పుడు శాసిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలికి సింహభాగం ఆదాయాన్ని బీసీసీఐనే అందిస్తోంది. ఇటువంటి పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తోంది. సింహం ముందు కుప్పిగంతుల మాదిరిగా అడ్డగోలు పనులకు పాల్పడుతోంది. పాకిస్తాన్ వేస్తున్న వెర్రి వేషాలు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఆగ్రహాన్ని కలిగించాయి.
ఇటీవల ఆసియా కప్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో వెకిలి చేష్టలకి పాల్పడ్డారు. రఫెల్ ఫైటర్ జెట్ లు కూల్చివేసామని అడ్డగోలుగా మాట్లాడారు. భారత ఆటగాళ్ల మీదికి దూసుకు వచ్చారు. దీనిపై బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసింది. బిసిసిఐ రంగంలోకి దిగడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత టీమిండియా ఆసియా కప్ గెలిచినప్పటికీ కూడా ట్రోఫీని పిసిబి చైర్మన్ నుంచి స్వీకరించడానికి ఇష్టపడలేదు. అంతేకాదు మైదానంలో భారత ఆటగాళ్లు వినూత్నమైన విధానంలో నిరసన తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు పోయింది.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మరణానికి పాకిస్తాన్ సైన్యం కారణమైన నేపథ్యంలో భారత్ స్పందించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆఫ్ఘనిస్తాన్ కు అండగా నిలిచింది. కష్ట కాలంలో ధైర్యంగా ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కు సూచించింది. భవిష్యత్ కాలంలో తమ భరోసా ఎప్పటికీ ఉంటుందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కు భారత్ తెలియజేసింది.. అంతేకాదు పాకిస్తాన్ సైన్యం చేసిన పనిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. పాకిస్తాన్ సైన్యం చేసిన పని వల్ల యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం దుఃఖంలో మునిగిపోయిందని పేర్కొంది.
కన్ను మూసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు భారత క్రికెట్ నియత్రణ మండలి ఓ ప్రకటనలో సంతాపాన్ని తెలిపింది. ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని ప్రార్థిం చింది. అంతేకాదు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ట్రై సిరీస్లో ఆడకుండా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గొప్పగా అభివర్ణించింది. ఈ నిర్ణయంతో నైనా పాకిస్తాన్ తన ధోరణి మార్చుకోవాలని.. హింసాయుత విధానాలకు దూరంగా ఉండాలని హితపు పలికింది.