India Strong Warning To Bangladesh: భారత్‌కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూల్చి.. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌కు దూరంగా ఉంటోంది. పాకిస్తాన్, చైనాతో దోస్తీ చేస్తోంది. వాటి అండ చూసుకుని భారత్‌ను కవ్విస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు పశువుల దొంగలు ఈశాన్య రాష్ట్రం అయిన త్రిపురలోకి అక్రమంగా చొరబడ్డారు. పశువులను తరలించుకుపోయేందుకు ప్రయత్నించి పట్టుపడ్డారు. గ్రామస్తులు చితకబాదడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురూ మృతిచెందారు. దీనినే బంగ్లాదేశ్ రాజకీయం చేయాలని చూస్తోంది.
ఏం జరిగిందంటే..
ఉత్తర త్రిపుర జిల్లా కొవాయి ప్రాంతంలోని విద్యాబిల్ గ్రామం వద్ద సరిహద్దు భద్రతా సమస్య మళ్లీ ప్రత్యక్షమైంది. బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మూడు కిలోమీటర్ల లోతు వరకు భారతదేశ భూభాగంలోకి ప్రవేశించారు. స్థానికులపై ఆయుధ దాడులకు దిగటంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. గ్రామస్థుల ప్రతిఘటనకు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసుల సమాచారం మేరకు వారిని ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు. చనిపోయిన వ్యక్తులను స్థానిక పోలీసులు జోయల్ మియా, సజల్ మియా, పండిత్ మియా అని గుర్తించారు.
బంగ్లాదేశ్ వితండవాదం..
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినంగా స్పందించింది. తమ పౌరులను భారత భద్రతా సిబ్బంది దాడి చేసి చంపారని ఆరోపిస్తూ అధికారిక నిరసన తెలిపింది. అయితే భారత వైపు నుంచి మాత్రం ఇది సరిహద్దు దాటి పశువుల దొంగతనం ప్రయత్నంగా పేర్కొంటూ, స్థానికులే స్వీయరక్షణ చర్యగా ప్రతిఘటించారని స్పష్టం చేసింది. భారత సరిహద్దు భద్రతా దళాలు ఇప్పటికే బంగ్లా అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం – అక్రమ చొరబాట్లు కొనసాగితే మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భద్రతా లోపాల సంకేతం..
డ్యాం నిర్మాణానికి యత్నం..
సరిహద్దు ఉద్రిక్తతలతోపాటు, మూరి నది మీద డ్యాం నిర్మాణం అంశం మరో సున్నిత స్థితిని సృష్టిస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కలికాపూర్ గ్రామం సమీపంలో నిర్మాణ పనులు ప్రారంభించగా, అది త్రిపుర రాష్ట్రంలోని బెలోనియా పట్టణం వద్ద ముంపు ప్రమాదాన్ని తెచ్చే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒప్పందం ప్రకారం 150 గజాల పరిధిలో ఎలాంటి నిర్మాణం చేయరాదని నిర్ణయం ఉన్నా, వాస్తవంగా డ్యాం కేవలం 5–15 గజాల దూరంలోనే సాగుతోంది. ఈ చర్యను భారత్ అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనగా చూస్తోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ ఈ సంఘటనను రాజకీయ రంగంలోకి లాగడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దౌత్యవర్గాలు స్ఫష్టం చేస్తున్నాయి – సరిహద్దు ఉల్లంఘనలు చెల్లుబాటు కానివి, వాటిని అంతర్గత భద్రతా విశయంలో సమర్థించరాదని. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు తరచుగా స్థానిక చౌకబారు రాజకీయాల వేదికగా మారటం, రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత దౌత్య బంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.