Homeక్రీడలుక్రికెట్‌IND W vs ZIM W: 19 పరుగులకు రెండు వికెట్లు.. హర్మన్, దీప్తి సెంచరీల...

IND W vs ZIM W: 19 పరుగులకు రెండు వికెట్లు.. హర్మన్, దీప్తి సెంచరీల సునామీ.. పాపం జింబాబ్వే

IND W vs ZIM W: జింబాబ్వే జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టుకు ఆరంభం ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. స్టార్ ఓపెనర్లు స్మృతి మందాన, షఫాలీ వర్మ తక్కువ పరుగులకే వెనక్కి వచ్చారు. దీంతో భారత జట్టు కేవలం 19 పరుగులపై రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో వికెట్ పడితే భారత ఇన్నింగ్స్ కష్టాల్లో పడే ప్రమాదం ఉండేది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఏమాత్రం తొందర […]

IND W vs ZIM W: జింబాబ్వే జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టుకు ఆరంభం ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. స్టార్ ఓపెనర్లు స్మృతి మందాన, షఫాలీ వర్మ తక్కువ పరుగులకే వెనక్కి వచ్చారు. దీంతో భారత జట్టు కేవలం 19 పరుగులపై రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో వికెట్ పడితే భారత ఇన్నింగ్స్ కష్టాల్లో పడే ప్రమాదం ఉండేది.

ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఏమాత్రం తొందర పడలేదు. పరిస్థితిని అర్థం చేసుకుంది. జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. మరవైపు ప్రతీక రావల్ కూడా ఆమెకు అండగా నిలిచింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 124 పరుగులు జోడించారు. తద్వారా భారత ఇన్నింగ్స్ కు పటిష్టమైన పునాది వేశారు. ప్రతీక రావల్ ఏకంగా 61 పరుగులు చేయడం విశేషం.

హర్మన్ అదరహో

భారత్ రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో కౌర్ అద్భుతమైన బాధ్యత తీసుకుంది. వికెట్లు కాపాడుకుంటూనే స్కోర్ ను పెంచడం మీద దృష్టి పెట్టింది. వన్డే క్రికెట్లో ప్రతి బంతిని బౌండరీకి తరలించాలి అనే ఆలోచన కంటే.. ఇన్నింగ్స్ నిర్మించుకోవడమే ముఖ్యమని హర్మన్ తన ఆట తీరుతో మరోసారి నిరూపించింది.

హర్మన్ బ్యాటింగ్లో కవర్ డ్రైవ్లు.. బ్యాక్ ఫుల్ షాట్లు.. కట్ షాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. ముఖ్యంగా ఆఫ్ సైడ్ లో ఆమె తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. ప్రత్యర్థి బౌలర్ తప్పిదాలను తనకు అనుకూలంగా మార్చుకుంది.

హర్మన్ 121 బంతుల్లో 126 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ చేసిన తర్వాత అక్కడే ఆగిపోకుండా.. భారీ స్కోర్ చేసే విధంగా ఆమె ప్రయత్నించింది. అయితే ఆమె ఇచ్చిన మూడు క్యాచ్ లను జింబాబ్వే ఫీల్డర్లు చేజర్చారు. వీడిని తనకు అనుకూలంగా మార్చుకుంది.

దీప్తి శర్మ సునామీ

హర్మన్ ఇన్నింగ్స్ ను నిలబెడితే.. దీప్తి శర్మ స్కోర్ వేగాన్ని పెంచింది. నాలుగో వికెట్ పడిన తర్వాత దీప్తిరంగంలోకి దిగింది. అప్పటికే ఉన్న ఒత్తిడిని తనపైకి తీసుకోకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. స్వీప్ షాట్లను ఆకట్టుకునే విధంగా ఆడింది. జింబాబ్వే బౌలర్ల బౌలింగ్ లైన్ ను మొత్తం దెబ్బతీసింది. కేవలం ఈ షాట్ ద్వారానే ఆమె 36 పరుగులు సాధించింది.. దీప్తి 86 బంతుల్లో 106* పరుగులు చేసింది దీప్తి చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు ఉన్నాయి. కేవలం యండమూడి బంతులోనే దీప్తి సెంచరీ చేసింది. ఆరవ స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ కు వచ్చి.. వన్డేలో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళ క్రికెటర్ గా దీప్తి ఆవిర్భవించింది.

హర్మన్, దీప్తి కలిసి ఐదవ వికెట్ కు 150 కి పైగా పరుగులు చేసి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకరు ఇన్నింగ్స్ నిలబెడితే.. మరొకరు స్కోర్ వేగాన్ని పెంచుతూ జట్టును ముందుకు తీసుకెళ్లారు. హర్మన్, దీప్తి ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడానికి ప్రధాన కారణం వారి అనుభవం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం, ప్రత్యర్థి బౌలింగ్ కు తగ్గట్టుగా వ్యూహాలను మార్చుకోవడం, హర్మన్ ఇన్నింగ్స్ కు పునాది వేసింది.. దీప్తి దానికి వేగాన్ని జోడించింది.. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశ నుంచి 328 పరుగులకు చేరుకోవడం అంటే మాటలు కాదు. ఇదంతా కూడా భారత మహిళల జట్టు పోరాట పటిమకు నిదర్శనం. ఈ మ్యాచ్లో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు సెంచరీలు సాధించడం కేవలం వ్యక్తిగత ప్రతిభకు గుర్తింపు మాత్రమే కాదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతలను పంచుకోవడం ఎంత ముఖ్యమో చెప్పే ఉదాహరణకు కూడా.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper