Homeక్రీడలుక్రికెట్‌Marco Johnson: ఏంటీ సామీ ఇదీ..ఇలాంటి క్యాచ్ ఎవరూ పట్టలేదు.. ఆస్ట్రేలియన్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది..

Marco Johnson: ఏంటీ సామీ ఇదీ..ఇలాంటి క్యాచ్ ఎవరూ పట్టలేదు.. ఆస్ట్రేలియన్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది..

Marco Johnson: ఒక్క చేత్తో క్యాచ్.. అంతే.. ఆస్ట్రేలియా కు దిమ్మతిరిగిపోయింది. మ్యాచ్ చేజారిపోయింది. క్రికెట్లో అప్పుడప్పుడూ అద్భుతమైన ఘట్టాలు జరుగుతుంటాయి. ఈ ఘట్టానికి బ్రహ్మాండమైన స్థానం కల్పించవచ్చు. వాస్తవానికి ఇటువంటిది జరుగుతుందని.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఊహించలేదు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం అంచనా వేయలేదు. కానీ మైదానంలో కూర్చున్న ప్రేక్షకులకు మాత్రం అదిరిపోయే క్రికెట్ అనుభూతి లభించింది. డర్బన్ వేదికగా మ్యాచ్ డర్బన్ లోని కింగ్స్ మీడ్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరిగింది. […]

Marco Johnson: ఒక్క చేత్తో క్యాచ్.. అంతే.. ఆస్ట్రేలియా కు దిమ్మతిరిగిపోయింది. మ్యాచ్ చేజారిపోయింది. క్రికెట్లో అప్పుడప్పుడూ అద్భుతమైన ఘట్టాలు జరుగుతుంటాయి. ఈ ఘట్టానికి బ్రహ్మాండమైన స్థానం కల్పించవచ్చు. వాస్తవానికి ఇటువంటిది జరుగుతుందని.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఊహించలేదు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం అంచనా వేయలేదు. కానీ మైదానంలో కూర్చున్న ప్రేక్షకులకు మాత్రం అదిరిపోయే క్రికెట్ అనుభూతి లభించింది.

డర్బన్ వేదికగా మ్యాచ్

డర్బన్ లోని కింగ్స్ మీడ్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరిగింది. ముందుగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 297 రన్స్ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రిట్జ్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు.. ఏకంగా 112 పరుగులు చేశాడు. ఇతనికి తోడుగా మార్కో యాన్సన్ కూడా అదరగొట్టాడు. కేవలం 59 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా స్కోర్ 297 పరుగులకు చేరుకోవడం వెనుక యాన్సన్ కూడా కీలకపాత్ర పోషించాడు.

ఆసీస్ గెలుస్తుందనుకున్నారు

ఆస్ట్రేలియా ఛేజింగ్ మొదలు పెట్టినప్పుడు చూస్తే.. ఈ మ్యాచ్ అంత ఈజీగా దక్షిణాఫ్రికా దక్కుతుందని అనిపించలేదు. మిచెల్ మార్ష్ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 36 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. హెడ్ తో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని 90 పరుగులకు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా సులువుగా గెలిచే లాగా కనిపించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో 36 ఓవర్ లో మ్యాట్ రైన్ షా అప్పటికే 44 పరుగులు చేశాడు.. కోయట్జీ బౌలింగ్ చేస్తున్నాడు. షార్ట్ బంతి.. రైన్ షా గట్టిగా కొట్టాడు. బంతి గాలిలోకి లేచింది. డీప్ మిడ్ వికెట్ లో ఉన్న యాన్సన్ బంతివైపు పరుగులు పెట్టాడు. అక్కడే అసలు సినిమా మొదలైంది. బంతి అతని నుంచి దూరంగా వెళ్తుంది. క్యాచ్ అందుకోవాలంటే కచ్చితంగా జంప్ చేయాల్సిందే. యాన్సన్ పరుగులు పెట్టాడు. ఒక్కసారిగా ముందుకు దూకాడు. కుడిచేతిని పూర్తిగా చాపాడు. బంతి నేలకు తాకడానికి కొద్ది అంగుళాల దూరంలోనే ఉంది. చివరికి యాన్సన్ బంతిని అందుకున్నాడు.

రిప్లైలో ఏం తేలిందంటే..

రిప్లై లో అతడు బొటనవేలు.. చూపుడువేలు మధ్యలో బంతిని పట్టుకున్నట్టు కనిపించింది. మైదానంలో అంపైర్లు కూడా మరోసారి ఆ క్యాచ్ పరిశీలించారు. రిప్లై లో అది క్లీన్ క్యాచ్ అని తేలింది. ఈ వికెట్ పడిన తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగుల వద్ద ఉంది. ఆస్ట్రేలియా విజయానికి 83 పరుగులు కావాలి. అయితే చివర్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లను కేవలం 54 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 230 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0 లీడ్లోకి వెళ్ళింది. యాన్సన్ పట్టిన క్యాచ్.. కేవలం వికెట్ మాత్రమే కాదు.. మ్యాచ్ ను ఆస్ట్రేలియా నుంచి దూరం చేసింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో ప్రతిభ చూపించి యాన్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Proteas Men (@proteasmencsa)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper