Homeటాప్ స్టోరీస్Harini Death Case: నర్సింగ్ విద్యార్థిని హరిణి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. పోస్టుమార్టం లో...

Harini Death Case: నర్సింగ్ విద్యార్థిని హరిణి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. పోస్టుమార్టం లో బయటపడ్డ నిజం

Harini Death Case: ఖమ్మం నగరంలో నర్సింగ్ చదువుతున్న 18 సంవత్సరాల ఇంద్రవల్లి హరిణి అనే యువతి మృతి కేసు మరో మలుపుతీసుకుంది. హరిణి మృతిని మొదట్లో అనుమానాస్పద మృతి అనుకున్నారు. అయితే పోస్టుమార్టం లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె మృతిని హత్యగా పోలీసులు మార్చారు. అసలు ఏం జరిగిందంటే హరిణి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం. ఈమె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ చదువుతోంది. ఇటీవల కాలేజీకి […]

Harini Death Case: ఖమ్మం నగరంలో నర్సింగ్ చదువుతున్న 18 సంవత్సరాల ఇంద్రవల్లి హరిణి అనే యువతి మృతి కేసు మరో మలుపుతీసుకుంది. హరిణి మృతిని మొదట్లో అనుమానాస్పద మృతి అనుకున్నారు. అయితే పోస్టుమార్టం లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె మృతిని హత్యగా పోలీసులు మార్చారు.

అసలు ఏం జరిగిందంటే

హరిణి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం. ఈమె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ చదువుతోంది. ఇటీవల కాలేజీకి సెలవులు రావడంతో సొంత ఊరుకు వచ్చింది. ఈనెల 22న ఆమె తల్లి రాజేశ్వరి కొద్దిసేపు పని ఉంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. ఆ సమయంలో హరిని ఒక్కతే ఉన్నది. రాజేశ్వరి ఇంటికి రాగానే హరిణి కనిపించలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వెతికింది. ఇంటి బాత్రూం వెనుక భాగంలో హరిణి చనిపోయి కనిపించింది. హరిణి మృత దేహం పై గాయాలు ఉన్నాయి. మెడ పై నలిమిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో రాజేశ్వర్ కి మొదటి నుంచే అనుమానం మొదలైంది. పోలీసులు క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు. ఘటన స్థలంలో అనేక ఆధారాలను సేకరించారు.

పోస్టుమార్టం అనంతరం

పోస్టుమార్టం అనంతరం వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. గొంతు నులిమి చంపడం వల్లే హరిణి చనిపోయిందని పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఇచ్చారు.. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆనవాళ్లు లేవని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా నమోదు చేసిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసు లాగా మార్చారు. హరిణి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదులో ఇదే గ్రామానికి చెందిన 20 సంవత్సరాల డి పవన్ కుమార్ పై అనుమానం వ్యక్తం చేసింది. హరిణి ని పెళ్లి చేసుకోవాలని పవన్ కుమార్ కొద్దిరోజులుగా ఆమెను వేధించేవాడు. పెళ్లి కానుక చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఇది కేవలం రాజేశ్వరి వ్యక్తం చేసిన అనుమానం మాత్రమే.. ఇంతవరకు ఈ నేరం కోర్టులో నిరూపణ కాలేదు. ఈ కేసులో మొదట్లో జరిగిన ప్రచారంలో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. మొదట్లో హరిణి మృతిని అనుమానాస్పద మృతి గానే పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదికలో హరిణి ని గొంతు నులమడం వల్లే చనిపోయిందని వైద్యులు చెప్పడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు మొదలుపెట్టారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ

ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇటీవల బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా సంఘాల నాయకులు రోడ్డుమీదికి వచ్చి ధర్నా చేశారు. ఆందోళన చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుమీద ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు కూడా ఈ కేసులో అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper