Homeక్రీడలుArgentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించింది. రెండు జట్లలో కొదమసింహాల లాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. బంతిని అద్భుతంగా డిపెండ్ చేయగలిగారు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో అర్జెంటీనా గెలుపు మీద ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. పైగా జట్టులో మెస్సి లాంటి ఆటగాడు కూడా ఉన్నాడు. ఈ టోర్నీలో అతడు తిరుగులేని విధంగా గోల్స్ చేశాడు. దీంతో అర్జెంటీనా గెలుస్తుందని.. ట్రోఫీ అందుకుంటుందని అందరు భావించారు. కానీ ఇక్కడే స్పెయిన్ మ్యాజిక్ చేసింది.

ఈ టోర్నీ మొత్తం అర్జెంటీనా జట్టు డామినేట్ చేసింది. మిగతా జట్లకు చుక్కలు చూపించింది. ఉత్కంఠ మధ్య గోల్స్ చేసి అదరగొట్టింది. కానీ ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ప్రత్యర్థి జట్టు డిఫెన్స్ ముందు తలవంచింది. బంతిని అటాకింగ్ మాత్రమే చేయగలిగిన అర్జెంటీనా.. గోల్ పోస్ట్ వైపు మళ్లించలేకపోయింది. దీనివల్ల ప్రత్యర్థి జట్టు మీద పై చేయి సాధించడానికి అవకాశం లేకుండా పోయింది.

అర్జెంటీనా కొంపముంచింది ముమ్మాటికి ఆ జట్టు ఆటగాడు ఫెర్నాన్డేజ్. అతడు కాళ్లు తగిలి స్పెయిన్ ప్లేయర్ గాలిలో ఎగిరిపడ్డాడు. దీంతో ఆధరికి మ్యాచ్ రిఫర్ రెండో ఎల్లో కార్డు ఇచ్చాడు. ఆటోమెటిక్ క్రెడిట్ కార్డ్ వల్ల అర్జెంటీనా అదనపు సమయంలో కేవలం పది మందితో మాత్రమే ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో స్పెయిన్ అదిరిపోయే రేంజ్ లో గోల్ కొట్టింది. ఆ తర్వాత అర్జెంటీనా జట్టుకు గోల్ కొట్టే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా స్పెయిన్ తాను చేసిన గోల్ మొత్తాన్ని చివరి వరకు కాపాడుకుంది. పదిమంది ప్లేయర్లతో డిఫెండ్ చేయలేక ఓటమిపాలైంది. అర్జెంటీనా ఆటగాడు మెస్సికి ఇది చివరి టోర్నీ. ఓటమితో అతడు తన చిరకాల కోరికను నెరవేర్చుకోలేకపోయాడు.

ఈ మ్యాచ్లో మెస్సి గోల్ చేస్తాడని.. తన మ్యాజిక్ ప్రదర్శిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడి ఎత్తుగడలకు పై ఎత్తులు వేసి స్పెయిన్ చుక్కలు చూపించింది. అద్భుతమైన డిఫెన్స్.. అడ్డుగోడ లాంటి గోల్ కీపర్.. వల్ల మెస్సి గోల్ చేయలేకపోయాడు. అతడు చేసిన ప్రతి ప్రయత్నాన్ని స్పెయిన్ అద్భుతంగా అడ్డుకున్నది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒత్తిడిలోకి నెట్టింది. ఒత్తిడి తట్టుకోలేక అర్జెంటీనా ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని మ్యాచ్ చివరి వరకు కొనసాగించడంలో స్పెయిన్ ప్లేయర్లు విజయవంతమయ్యారు. చివరికి విజయం సాధించి రెండవసారి ఫిఫా ట్రోఫీని తమ ఖాతాలో వేసుకున్నారు. 2010లో స్పెయిన్ ఫిఫా కప్ దక్కించుకుంది. మళ్లీ 16 సంవత్సరాల తర్వాత ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ లో విజయం సాధించి దర్జాగా తమ జాతి కలను నిజం చేసి చూపించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular