Homeక్రీడలుLamine Yamal : అందరూ ఉద్దండులే.. స్పెయిన్ వెన్నెముక మాత్రం ఇతడే. నిలబడితే మెస్సీకి చుక్కలే

Lamine Yamal : అందరూ ఉద్దండులే.. స్పెయిన్ వెన్నెముక మాత్రం ఇతడే. నిలబడితే మెస్సీకి చుక్కలే

Lamine Yamal : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో మెస్సీ తర్వాత ఈ ఆటగాడు అందరి మదిలో మెదులుతున్నాడు. అతడి ఆట తీరు చూసేందుకు.. అతడు గోల్స్ చేస్తే తనివితీరా చూడాలాని కోట్లాదిమంది ఆసక్తిగా చూస్తున్నారు. ఏకంగా మెస్సీకి గట్టి పోటీ ఇచ్చే ఆ ఆటగాడు ఎవరు?, అతడి నేపథ్యం ఏంటి? అతడిస్థాయి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెస్సీ తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న […]

Lamine Yamal : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో మెస్సీ తర్వాత ఈ ఆటగాడు అందరి మదిలో మెదులుతున్నాడు. అతడి ఆట తీరు చూసేందుకు.. అతడు గోల్స్ చేస్తే తనివితీరా చూడాలాని కోట్లాదిమంది ఆసక్తిగా చూస్తున్నారు. ఏకంగా మెస్సీకి గట్టి పోటీ ఇచ్చే ఆ ఆటగాడు ఎవరు?, అతడి నేపథ్యం ఏంటి? అతడిస్థాయి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మెస్సీ తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆటగాడి పేరు యామల్. ఇతడిది స్పెయిన్ జట్టు. ఇతడు ఆ జట్టుకు వెన్నెముక లాగా మారిపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో అతడు సత్తా చూపిస్తే స్పెయిన్ జట్టుకు ఎదురు ఉండదు.

యామల్ అసలు పేరు లమన్ యామల్ నస్రౌయి ఎబానా.. యామల్ తండ్రి పేరు నస్రౌయి. ఇతడిది మొరాకో. తల్లి పేరు ఎబనా..ఈమె ఈక్వటోరియల్ గినియా ప్రాంతంలో పుట్టారు. యామల్ పుట్టినప్పుడు అతడి తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఆ సమయంలో వారి స్నేహితులు అండగా నిలిచారు. ఈ స్నేహితుల పేర్లు లమీన్, యామల్. వారు చేసిన సాయానికి గుర్తుగా తన కుమారుడికి వారు లమీన్ యామల్ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి.

లమీన్ అంటే అరబిక్ భాషలో అత్యకంగా నమ్మకమైన వ్యక్తి అని అర్థం. యామల్ అంటే సొగసు అని అర్థం. యామల్ 2007లో జన్మించాడు. బార్సిలోనా లా మాసియా అకాడమీలో శిక్షణ పొందాడు. ఇప్పుడు స్పెయిన్ జట్టులో ఆడుతున్నాడు. మెట్ లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో యామల్ అర్జెంటీనాతో పోటీ పడబోతున్నాడు.

యామల్ చిన్నగా ఉన్నప్పుడు ఓ చారిటీ కార్యక్రమం కోసం మెస్సీ అతడిని ఎత్తుకుని, స్నానం చేయించాడు. అప్పుడు మెస్సీ వయసు 20 సంవత్సరాలు. నాడు యామల్ వయసు ఆరునెలలు. నాటి యామల్ ఇప్పుడు మెస్సీకి ప్రత్యర్థి. చారిటీ కార్యక్రమానికి సంబంధించి జరిగిన ఫొటో షూట్ కు నేటితో 19 ఏళ్లు. సరిగ్గా ఇన్నేళ్ల తర్వాత మెస్సీ, యామల్ పోటీపడుతున్నారు.

ఇటీవల జూలై 13న యామల్ తన బర్త్ డే జరుపుకున్నాడు. మెస్సీ తన ఫస్ట్ ప్రపంచ కప్ గోల్ 18 ఏళ్ల వయసులో చేశాడు. 19వ నంబర్ జెర్సీ ధరించాడు. యామల్ కూడా 18 ఏళ్ల వయసులో మొదటి ప్రపంచ కప్ గోల్ సాధించాడు. 19వ నంబర్ జెర్సీ ధరించాడు. వీరిద్దరి క్రీడాజీవితంలో ఈ సంఘటన ఒకే తీరుగా జరగడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper