spot_img
Homeక్రీడలుక్రికెట్‌Joe root: జో రూట్ సరికొత్త ఘనత.. రోహిత్ రికార్డు గల్లంతు

Joe root: జో రూట్ సరికొత్త ఘనత.. రోహిత్ రికార్డు గల్లంతు

Jo root:  తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక బౌలర్ల ధాటికి 42 పరుగులకే రెండు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజు లోకి వచ్చిన రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కొంటూ 143 రన్స్ చేశాడు. ఈ సెంచరీ ద్వారా ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక శతకాలు బాదిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు అంతకుముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (48) పేరు మీద ఉండేది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (80) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు..కుక్(33) ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉండగా.. ప్రస్తుతం అతడి స్థానంలో సమంగా రూట్ (33) నిలిచాడు. రూట్ తర్వాత కెన్ పీటర్సన్ (23) కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక శతకాలు బాదిన టాప్ -3 ఆటగాళ్లల్లో కుక్, రూట్, పీటర్సన్ కొనసాగుతున్నారు.. శ్రీలంక జట్టుపై 143 పరుగులు చేసిన నేపథ్యంలో.. తన అద్భుతమైన సెంచరీని తన బ్యాటింగ్ మాజీ మెంటార్, స్నేహితుడైన గ్రాహం తోర్ప్ కు రూట్ అంకితం ఇచ్చాడు. ఇటీవల గ్రాహం కన్నుమూశాడు. 145 టెస్ట్ మ్యాచ్ లలో 12274 రన్స్ చేశాడు. ఇందులో 33 సెంచరీలు ఉన్నాయి. 5 డబుల్ సెంచరీలు, 64 అర్థ సెంచరీలు సాధించాడు. 171 వన్డేలు ఆడి 6522 రన్స్ చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు ఉన్నాయి.. 2020 వరకు రూట్ టెస్ట్ లలో 17 సెంచరీలు మాత్రమే సాధించాడు. ఆ తర్వాత అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహ స్వప్నం లాగా మారిపోయి పరుగుల మీద పరుగులు చేస్తున్నాడు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఏకంగా 16 సెంచరీలు చేశాడంటే..రూట్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక బౌలర్లు ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రూట్, అట్కిన్సన్ మైదానంలోకి వచ్చిన తర్వాత శ్రీలంక బౌలర్లు చేతులెత్తేశారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి వీరోచిత బ్యాటింగ్ ఫలితంగా శ్రీలంక జట్టు భారీ స్కోర్ సాధించింది.. డకెట్ 40, హ్యారీ బ్రూక్ 33 రన్స్ చేసి ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. లారెన్స్(9), పోప్(1), వోక్స్(6) పూర్తిగా నిరాశపరిచారు. ఇక శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. మిలన్ రత్నాయక్, లాహిరు కుమార చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper