Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni: మైదానం వీడినా తగ్గని తలా హవా.. ధోని CSK మెంటార్ గా మారడం...

MS Dhoni: మైదానం వీడినా తగ్గని తలా హవా.. ధోని CSK మెంటార్ గా మారడం వెనుక అసలు కారణాలు ఇవే

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోని.. ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. మార్గదర్శకుడి అవతారం ఎత్తాడు. ఈ బాధ్యతలు చేపట్టడం క్రీడా వర్గాలలో ఆసక్తికరంగా మారింది. జట్టు సారధిగా.. ఫినిషర్ గా.. మైదానంలో అభిమానులను ఉర్రూతలూగించిన “తలా” ఇప్పుడు డగ్ అవుట్ లో కూర్చుని వ్యూహాలు రచించే పాత్రలోకి మారడం వెనుక ప్రధానంగా నాలుగు బలమైన కారణాలు […]

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోని.. ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. మార్గదర్శకుడి అవతారం ఎత్తాడు. ఈ బాధ్యతలు చేపట్టడం క్రీడా వర్గాలలో ఆసక్తికరంగా మారింది. జట్టు సారధిగా.. ఫినిషర్ గా.. మైదానంలో అభిమానులను ఉర్రూతలూగించిన “తలా” ఇప్పుడు డగ్ అవుట్ లో కూర్చుని వ్యూహాలు రచించే పాత్రలోకి మారడం వెనుక ప్రధానంగా నాలుగు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

వయసు.. సామర్థ్యం

సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్న ధోనికి ప్రస్తుతం వయస్సు రీత్యా పూర్తిస్థాయి సీజన్లో ఆటగాడిగా కొనసాగడం శారీరకంగా పెద్ద సవాల్ గా మారింది. ముఖ్యంగా వికెట్ కీపింగ్ చేస్తూ సామర్ధ్యాన్ని కాపాడుకోవడం కష్టంగా మారుతోంది. గత కొన్ని సీజన్లుగా మోకాలి నొప్పితో బాధపడుతూనే.. కేవలం చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వచ్చి మెరుపులు మెరిపించాడు ధోని. ఈ నేపథ్యంలో శరీరం పై అదనపు భారం వేసుకోకుండా ఆటగాడిగా తప్పుకోవడమే సరైన నిర్ణయమని అతడు భావించాడు.

బలమైన బృందాన్ని తయారు చేయాలని..

చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తులో సమర్థవంతంగా నడిపించడానికి ఒక బలమైన యువ నాయకత్వ బృందాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. యంగ్ ప్లేయర్లను తీర్చి దిద్దడంలో.. ఒత్తిడితో కూడిన క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా వారిని మానసికంగా సన్నద్ధం చేయడంలో ధోని అనుభవం డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో ముఖ్యం.

విడదీయలేని అనుబంధం

ధోని పూర్తిగా క్రికెట్ కు దూరమైతే అది చెన్నై జట్టుకే కాకుండా.. కోట్లాదిమంది అభిమానులకు అది తీరని లోటు అవుతుంది. జట్టుతో అతడికి ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని.. మైదానంలో ఆయన ప్రదర్శించే వ్యూహాత్మక మేధస్సును వదులుకోవడానికి చెన్నై జట్టు సిద్ధంగా లేదు. అందుకే అతడిని మార్గదర్శిగా నియమించింది. అందువల్ల డగ్ అవుట్ నుంచి జట్టు వ్యూహాలను రూపొందించడంలో.. ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం ఇవ్వడంలో ఆయన సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది.

గతంలో ఆ అనుభవం

ధోనికి మార్గదర్శి పాత్ర కొత్త కాదు. గతంలో 2021 t20 ప్రపంచ కప్ సమయంలో భారత జట్టుకు అతడు మార్గదర్శిగా వ్యవహరించాడు. పెద్ద టోర్నమెంట్లు.. కీలక మ్యాచ్లలో ఆటగాళ్ల మీద ఉండే ఒత్తిడిని ఎలా అధిగమించాలో నేర్పించడంలో అతడిది అందే వేసిన చెయ్యి.

మొత్తంగా చూస్తే మైదానంలో బ్యాట్ పట్టుకొని పరుగులు చేసే బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల ప్రయాణంలో తెరవెనక ప్రధాన వ్యూహకర్తగా.. జట్టుకు పెద్ద దిక్కుగా కొనసాగడానికి ధోని ఈ పాత్రను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర పోషిస్తున్న ధోనికి చెన్నై మేనేజ్మెంట్ ఏ స్థాయిలో ఇస్తుందనేది ఇంతవరకు తెలియలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper