Lungi Ngidi Injury: ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో ఢిల్లీ జట్టు ఆటగాడు ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ క్యాచ్ అందుకోవడానికి అతడు ప్రయత్నించాడు. బంతిని అందుకునే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి మైదానంలో పడ్డాడు. అతడి తల మైదానానికి గట్టిగా గుద్దుకోవడంతో స్పృహ తప్పి పడిపోయాడు.
అతడు అలా పడిపోవడంతో తోటి ప్లేయర్లు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. అతనిలో చలనం లేకపోవడంతో మైదానంలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. పంజాబ్ కోచ్ పాంటింగ్.. దక్షిణాఫ్రికా ప్లేయర్లు అమాంతం మైదానంలోకి వచ్చారు. వైద్యులు అప్పటికి ఎంగిడి వైద్యులకు సహకరించలేదు. అతడిలో స్పృహ లేకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. దీంతో అతడిని వైద్యులు పరిశీలించారు. అతడు కనీసం కదలలేని స్థితిలో ఉండడంతో అంబులెన్స్ రప్పించారు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా అంబులెన్స్ మైదానంలోకి వచ్చింది. దీంతో ఎంగిడిని అందులో నుంచి హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అతడు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మైదానానికి గట్టిగా గుద్దుకోవడంతో తలకు గాయమైందని.. అతడు కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టులో అతడు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది.
ఢిల్లీ గట్టు ప్రధాన బౌలర్లలో ఎంగిడి ఒకరు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంలో అతడు సిద్ధహస్తుడు. అందువల్లే ఢిల్లీ మేనేజ్మెంట్ అతడిని కొనుగోలు చేసింది.. అయితే అతడు అనుకోకుండా గాయపడిన నేపథ్యంలో.. ఢిల్లీ జట్టు బౌలింగ్ బలం తగ్గింది.. కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. రాహుల్ వీరోచితమైన సెంచరీ తో 254 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఢిల్లీ జట్టు విఫలమైంది. దీంతో ఏడు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ జట్టు విజయం సాధించింది.
పంజాబ్ జట్టులో ఓపెనర్లు, అయ్యర్ అదరగొట్టారు. టి20 చరిత్రలోనే హైయెస్ట్ రన్ స్కోర్ చేజ్ చేశారు. పంజాబ్ జట్టు సారధిగా అయ్యర్ ఉండగా.. ఏ జట్టు కూడా ఓడించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ హాఫ్ సెంచరీ తో అయ్యర్ ఐపీఎల్లో 4వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. పంజాబ్ జట్టు ప్రస్తుత ఐపీఎల్ లో ఒక ఓటమి కూడా లేకుండా సాగిపోతోంది. పాయింట్లు పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.