Homeఎంటర్టైన్మెంట్From Season 4 Review: #From 'సీజన్ 4' వెబ్ సిరీస్ రివ్యూ : క్లైమాక్స్...

From Season 4 Review: #From ‘సీజన్ 4’ వెబ్ సిరీస్ రివ్యూ : క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి గుండెలు ఆగిపోతాయి..

From Season 4 Review: మీకు హారర్ సినిమాలు , వెబ్ సిరీస్ లు చూసేందుకు అమితమైన ఆసక్తి ఉందా?, అయితే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న #From అనే వెబ్ సిరీస్ ని చూసేయండి. ఈ సిరీస్ తెలుగు లో అందుబాటులో లేదు కానీ ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ సిరీస్ చాలా చక్కగా అర్థం అవుతుంది. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. దీనిని కేవలం ఒక […]

From Season 4 Review: మీకు హారర్ సినిమాలు , వెబ్ సిరీస్ లు చూసేందుకు అమితమైన ఆసక్తి ఉందా?, అయితే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న #From అనే వెబ్ సిరీస్ ని చూసేయండి. ఈ సిరీస్ తెలుగు లో అందుబాటులో లేదు కానీ ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ సిరీస్ చాలా చక్కగా అర్థం అవుతుంది. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. దీనిని కేవలం ఒక హారర్ జానర్ సిరీస్ మాత్రమే అని చెప్పలేము , హారర్ కమ్ మిస్టరీ జానర్ సిరీస్. ఇప్పటికే 3 సీజన్స్ పూర్తి అయ్యాయి. రీసెంట్ గానే నాల్గవ సీజన్ మొదలైంది. నేడు అర్థ రాత్రి రెండవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ నాల్గవ సీజన్ మొదటి ఎపిసోడ్ ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

ముందుగా మొదటి మూడు సీజన్స్ కథ విషయానికి వస్తే, జిమ్ కుటుంబం ఫ్యామిలీ టూర్ కి వెళ్తూ ఉండగా, మార్గం మధ్యలో ఒక రోడ్డు వద్ద చెట్టు పడిపోయి ఉంటుంది. వెనక్కి తిరిగి వెళ్లగా ఒక విచిత్రమైన మిస్టీరియస్ ప్రదేశానికి చేరుకుంటారు. ఆ ప్రదేశాన్ని తప్పించుకొని వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు , అప్పటికే ఆ ప్రాంతం లో ఇలాగే అనేక మంది జనాలు చిక్కుకొని ఉంటారు. అందులో రిటైర్డ్ ఆర్మీ ఆఫీస్ బాయిడ్ షరీఫ్ ఒకడు. ఈయనే ఈ సిరీస్ కి హీరో. అయితే ఈయన ఆ మిస్టీరియస్ ఊర్లో కొన్ని కఠినమైన రూల్స్ ని క్రియేట్ చేస్తాడు. ఎవ్వరూ కూడా రాత్రి సమయం లో ఇంటిని దాటి బయటకు రాకూడదు , కనీసం కిటికీలను కూడా తెరవకూడదు. ఇదే ప్రధానమైన రూల్. ఈ రూల్ క్రియేట్ చేయడానికి కారణం అక్కడ మనిషి రూపం లో తిరిగే దెయ్యాలు ఉంటాయి కాబట్టి.

రాత్రి సమయాల్లో అవి రోడ్ల మీదకు వచ్చి జనాలను పీక్కొని తినేస్తుంటాయి. ఇళ్లల్లోకి కూడా ఆ దెయ్యాలు చొరబడి మనుషులను తినేయగలవు , కానీ టాలీస్ మ్యాన్ రాళ్లు కారణంగా వీళ్ళు సురక్షితంగా ఉంటారు. కానీ బయటకు రాత్రి సమయాల్లో వస్తే మాత్రం దెయ్యాలు పాప్ కార్న్స్ అయిపోతారు. అయితే ఈ మిస్టీరియస్ ప్లేస్ నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఒక్కటి కూడా సఫలీ కృతం అవ్వదు. అయితే ఇదే ప్రదేశంలో అత్యధిక కాలం నుండి నివసిస్తున్న వ్యక్తి విక్టర్. ఇతను అక్కడ ఉన్నవాళ్లందరినే రక్షించి తిరిగి ఇంటికి పంపాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా ఒక రోజు ఆయన జిమ్ సతీమణి తబిత ని ఒక చెట్టు తొర లోకి పంపిస్తాడు. ఆమె దాని ద్వారా ఒక లైట్ హౌస్ ని చేరుకొని, అక్కడి నుండి తన ఇంటికి చేరుకుంటుంది. మళ్లీ కొన్ని కారణాల వల్ల తిరిగి వచ్చేస్తుంది. అయితే ఈ మిస్టరీ ని ఛేదిస్తున్న సమయం లో వీళ్లకు ఒక ఎల్లో మ్యాన్ తారసపడుతాడు. ఆ ఎల్లో మ్యాన్ జిమ్ ని చంపేయడం తో సీజన్ 3 ముగుస్తుంది.

ఇక సీజన్ 4 లో ఒక కారు ఈ మిస్టీరియస్ ప్రదేశం లోకి దూసుకొచ్చి బాయిడ్ ఉండే పోలీస్ స్టేషన్ ని ఢీ కొడుతోంది. ఆ కారులో ఒక అమ్మాయి , ఆ అమ్మాయి తండ్రి ఉంటారు. వాళ్ళను లోపలకు తీసుకొచ్చి చికిత్స చేస్తారు. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏమిటంటే ఆ అమ్మాయి తన తండ్రిని చంపేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అతని కూతురు కాదు , జిమ్ ని చంపేసిన ఎల్లో మ్యాన్. అతను అమ్మాయి రూపం లో ఆ కారు లో లిఫ్ట్ అడిగి ఆ మిస్టీరియస్ ప్రదేశం లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ ఎల్లో మ్యాన్ అమ్మాయి రూపం లో ఎంతమందిని చంపేస్తాడో , అసలు ఏమి జరగబోతుందో తెలియాలంటే ఈరోజు అర్థ రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వబొయె రెండవ ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి . మరోపక్క చనిపోయిన జిమ్ దెయ్యం రూపం లో వచ్చి తన కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper